మామూలుగా లేదుగా: ‘సైరా’ టీజర్ వచ్చేసింది, చూసారా?

 

‘సైరా’ టీజర్‌ విడుదల

స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తీస్తున్న చిత్రం ‘సైరా’. మెగాస్టార్‌ చిరంజీవి టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న ఈ సినిమా టీజర్‌ ఈ రోజు ( ఆగస్టు 20న )విడుదల అయ్యింది. ఈ టీజర్ …పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ తో మొదలైంది. మొదటి నుంచి చివరి వరకూ ప్రతీ షాక్ ఇంట్రస్టింగ్ గా రూపొందించిన ఈ టీజర్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటోంది. ఈ టీజర్ చివరల్లో గూస్ బంప్స్ వచ్చేలా సైరా నరసింహా రెడ్డి అని చెప్పడం ప్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. ఆ టీజర్ మీరు ఇక్కడ చూడవచ్చు.

Sye Raa Teaser (Telugu) - Chiranjeevi | Ram Charan | Surender Reddy | #SyeRaaTeaser

ఇక అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్‌, విజయ్‌ సేతుపతి, నయనతార, తమన్నా, అనుష్క, జగపతిబాబు, సుదీప్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్టోబరు 2న చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15న ఈ సినిమా మేకింగ్‌ వీడియోను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి సంగతి తెలిసిందే.