మాతృభాష పైనే కల్యాణి ఫోకస్!?

 

మాతృభాష పైనే కల్యాణి ఫోకస్!?

ప్రేమ-పెళ్లి విషయంలో కల్యాణి ప్రియదర్శన్ కచ్చితమైన నిశ్చితాభిప్రాయంతోనే ఉన్నట్టు కనిపిస్తోంది. ‘ప్రేమిస్తా. ప్రేమ పెళ్లే చేసుకుంటా. కాకపోతే, ప్రేమలో అయితే ఇంకా పడలేదు. దానికోసం ప్రకటన ఇవ్వాల్సిన అవసరం లేదు. నా లవ్ మ్యారేజ్ ఓ రేంజ్‌లో ఉంటుంది. అందులో సందేహం కూడా లేదు’ అంటోందట కల్యాణి. ఆమె నిశ్చితాభిప్రాయం విన్న ఇండస్ట్రీ జనానికి మాత్రం గూస్‌బంప్స్ వస్తున్నాయి. అమ్మా నాన్న ఇద్దరూ ఇండస్ట్రీ వాళ్లే కావడంతో ఆ వాతావరణంలోనే పెరిగింది కల్యాణి. జీవితాన్ని లోతుగా చూసింది కనుక మనసు భావాన్ని కుండబద్ధలు కొట్టి మరీ చెబుతోంది అంటున్నారు విన్నవాళ్లు.

‘హలో’ చిత్రంతో టాలీవుడ్‌కొచ్చిన ఈ మలయాళీ బ్యూటీ  ఇక్కడ తన బాడీ లాంగ్వేజ్‌కు తగిన సరైన సినిమాలు దొరక్కపోవడంతో మాతృభాషలోనే ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టింది. అపుడప్పుడూ కోలీవుడ్‌నూ టచ్ చేస్తోంది. కల్యాణి ప్రియదర్శన్ తండ్రి ప్రియదర్శన్ తీసిన సినిమాలోనూ తన పెర్ఫార్మెన్స్ చూపించింది. నాన్న డైరెక్షన్‌లో సినిమా చేయడానికి కూతురిగా నేను ఇబ్బంది పడాలి. కానీ, దర్శకుడిగా నాన్న ఇబ్బంది పడ్డారు. అందుకే, మరోసారి సినిమా చేయలేమేమో అంటోంది కల్యాణి.

ఈమధ్యే తల్లి లిజీతో కలిసి ఓ యాడ్ ఫిల్మ్ చేసిన కల్యాణి  అమ్మతో కలిసి నటించడం ఆనందాన్నిచ్చిందని చెబుతోంది. తన టర్న్ వచ్చేవరకూ ఓపిగ్గా సినిమాలు చేస్తానని, ఆ టైం వచ్చినపుడు తనేంటో ప్రూవ్ చేసుకుంటానని నమ్మకంగా చెబుతోంది కల్యాణి.