Kalyani Priyadarshan: కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా పొటెన్షియల్ స్టూడియోస్ ప్రొడక్షన్ నెంబర్ 7 చెన్నైలో లాంచ్

Kalyani Priyadarshan: మాయ, మానగరం, మాన్స్టర్, తానక్కరన్, ఇరుగపాత్రు, బ్లాక్ వంటి వరుసగా ఆరు విజయవంతమైన చిత్రాల తర్వాత పొటెన్షియల్ స్టూడియోస్ తమ ప్రొడక్షన్ నెంబర్ 7ను గ్రాండ్ గా లాంచ్ చేసింది. ఈ చిత్రంలో జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందిన లోక స్టార్ కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

ఈ చిత్రంలో నాన్ మహాన్ అల్లా ఫేమ్ దేవదర్శిని, వినోద్ కిషన్, కీలక పాత్రలు పోషించనున్నారు. నూతన దర్శకుడు ధీరవియం SN దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ లో ప్రవీణ్ భాస్కర్ & శ్రీ కుమార్ దర్శకుడితో పాటు స్క్రీన్‌ప్లే సంభాషణలు రాశారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూర్చారు గోకుల్ బెనోయ్ సినిమాటోగ్రఫీ అందించారు. అరల్ ఆర్. తంగం ఎడిటర్‌గా, మాయాపాండి ప్రొడక్షన్ డిజైనర్‌గా, ఇనాజ్ ఫర్హాన్ మరియు షేర్ అలీ కాస్ట్యూమ్స్ అందిస్తున్నారు.

పొటెన్షియల్ స్టూడియోస్ బ్యానర్‌పై SR ప్రకాష్ బాబు, ఎస్.ఆర్. ప్రభు, పి. గోపీనాథ్, తంగప్రభహరన్ ఆర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఈరోజు చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

విలక్షణమైన కథనాలను, బాక్సాఫీస్ విజయాలను అందించడంలో పేరుపొందిన పొటెన్షియల్ స్టూడియోస్, కళ్యాణి ప్రియదర్శన్‌తో కలిసి పనిచేయడంతో ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్‌డేట్‌లు త్వరలో అనౌన్స్ చేస్తారు.

నటీనటులు: కళ్యాణి ప్రియదర్శన్, దేవదర్శిని, వినోద్ కిషన్

ప్రొడక్షన్ బ్యానర్ – పొటెన్షియల్ స్టూడియోస్ LLP
నిర్మాతలు – SR ప్రకాష్ బాబు, SR ప్రభు, పి గోపీనాథ్, తంగప్రభహరన్ R
దర్శకుడు – ధీరవియం SN
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – మద్రాస్ కృష్ణ
డిఓపి- గోకుల్ బెనోయ్
సంగీతం – జస్టిన్ ప్రభాకరన్
ఎడిటర్ – అరల్ ఆర్ తంగం
ప్రొడక్షన్ డిజైనర్ – మాయాపాండి
కాస్ట్యూమ్ డిజైనర్లు – ఇనాజ్ ఫర్హాన్ /షేర్ అలీ
పీఆర్వో: వంశీ శేఖర్

Puttaparthi Public Reaction On Chandrababu & Pawan Kalyan Puttaparthi Tour || Modi || Ys Jagan || TR