మహేష్ సినిమాలో చెప్పిన డైలాగు,బయిట నిజమైంది

లాడ్ డౌన్ ఎఫెక్ట్: మ‌హేష్ టెన్నీస్ ప్లేయ‌ర్

ట్రాఫిక్ రూల్స్ పేరు చెప్పి ట్రెండింగ్ లో మహేష్

ఒక్కోసారి సినిమాల్లో క్యాజువల్ గా చెప్పిన విషయాలు బయిట నిజం అయ్యిపోతూంటాయి. దాంతో ఆ సినిమా హీరో అభిమానుల ఆనందానికి అంతే ఉండదు. ఇక ఆ దర్శకుడుకు విషయం చెప్పక్కర్లేదు. తాజాగా భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త ట్రాఫిక్ నిబంధనలు హాట్ టాపిక్ గా మారాయి. గురుగ్రామ్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు కఠినంగా ఈ రూల్స్ ని పాటిస్తున్నారు. ఓ బైకర్ ట్రాఫిక్ రూల్స్ పాటించనందుకు 21వేలు, మరో ఆటో డ్రైవర్ కు 32 వేలు ఫైన్ విధించిన వార్తలు ఆసక్తికరంగా మారాయి.

భరత్ అనే నేను సినిమా చూసి ఈ కొత్తరూల్స్ తీసుకువచ్చినట్లు ఉన్నారు అంటూ సోషల్ మీడియాలో అనేక రకాల మీమ్స్, కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన భరత్ అనే నేను చిత్రం గత ఏడాది విడుదలై ఘనవిజయం సాధించింది. సూపర్ స్టార్ మహేష్ ఈ చిత్రంలో ముఖ్యమంత్రిగా నటించాడు. కియారా అద్వానీ ఈ చిత్రంలో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. కొరటాల శివ తెరకెక్కించిన ఈ పొలిటికల్ డ్రామాకు ప్రశంసలు దక్కాయి.

ఈ చిత్రంలో సీఎం భరత్ గా మహేష్ బాబు ట్రాఫిక్ నిబంధనల గురించి మాట్లాడే సన్నివేశం .. సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఆ సీన్ లో మహేష్ బాబు ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన నేరానికి 10వేలు, 20 వేలు, 25 వేలు అంటూ జరిమానా పెంచుకుంటూ పోతాడు. ప్రస్తుతం ఈ సన్నివేశాన్ని సోషల్ మీడియాలో అంతా గుర్తు చేసుకుంటున్నారు.

మహేశ్ బాబు అభిమానులు మాత్రం ఈ కొత్త చట్టం, కొత్త ట్రాఫిక్ జరిమానాలతో తెగ సంబరపడుతున్నారు. తమ అభిమాన హీరో నటించిన భరత్ అనే నేను సినిమా స్ఫూర్తితోనే ఈ సవరణలు జరిగాయంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.