మళ్ళీ కాపీ కొట్టేసారు!!!

సృజనాత్మక రంగం అయిన సినీ రంగంలో ఒకదానికొకటి స్ఫూర్తి అనుకుంటూ నిస్సిగ్గుగా మరొక కళాకారుడి సృష్టిని దోచేసుకుంటుంటారు. దానినే కాపీ అంటారు. ఇలా చేసిన వారి మీద కాపీరైట్ చట్టం ఇలా చాలా తతంగం ఉంది. ఒక్కోసారి కళాకారుడు బలహీనుడు అయితే కాపీ చేసాడు మొర్రో అని గోల పెడుతున్నా ఎవరూ పట్టించుకోరు. అలా కాక ఆ వ్యక్తి కాస్త పేరున్న వాడైతే ఎంతో కొంత ముట్టచెబుతారు.
ఇదంతా ఎందుకు అంటే, అలా తాజాగా దేవి శ్రీ చేసిన ‘ఖైదీ నెంబర్ 150 ‘ సినిమాలోని ‘అమ్మడు లెట్స్ డు కుమ్ముడు’ అనే పాటను అలాగే వాడేశారు హిందీ హౌసేఫుల్ 4 సినిమాలో. ఇది తెలుసుకున్న దేవి శ్రీ కి మరి ఆ దర్శకనిర్మాతలు ఎంత ముట్టచెప్పారో తెలియాల్సి ఉంది.
ఇలా గతంలో దేవి శ్రీ పాటలు ‘రింగ రింగ’ మొదలైనవి పలు హిందీ సినిమాల్లో వాడుకున్నారు.