సంక్రాంతి బరిలో మహేష్ నటిస్తున్న `సరిలేరు నీకెవ్వరు` చిత్రం రిలీజ్ అవుతున్న విషయం తెలిపిందే, ఈ చిత్రానికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న `అల వైకుంఠపురములో` గట్టి పోటీనిస్తోంది. సరిలేరు నీకెవ్వరు` చిత్రంతో పోలిస్తే సంగీత పరంగా, డైలాగ్స్ పరంగా, ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా ముందు వరుసలో నిలుస్తోంది. స్టార్ హీరో సినిమా అంటే ఆడియో అదిరిపోవాల్సిందే. కానీ మహేష్ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించినా పాటలు ఆ స్థాయిలో లేకపోవడం ఆ సినిమాకు పెద్ద డ్రాబ్యాక్.
`అల వైకుంఠపురములో` చిత్రం విషయంలో మాత్రం అదే ఆ సినిమాకు పెద్ద ఎస్సెట్‌గా మారింది. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు హ్యూజ్ హిట్ అయ్యాయి. బ్లాక్ బస్టర్ సినిమాకు ఎలాంటి పాటలు అవసరమో అదే స్థాయిలో పాటలు వుండటంతో `రాములో రాములా…`, `సామజవరగమన..` యూట్యబ్‌లో ఇప్పటికే వంద మిలియన్ వ్యూస్‌ని దాటి తెలుగు సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డుని సృష్టించాయి.
ఈ తేడాని ఇండైరెక్ట్‌గా గుర్తు చేస్తూ సోమవారం `అల వైకుంఠపుములో` టీమ్ నిర్వహించిన మ్యూజిక్ కాన్సెర్ట్‌లో చేసిన వ్యాఖ్యలు పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. `బ్లాక్ బస్టర్ కొట్టేశారు. ఇప్పటికే తమన్ పాటలతో, బన్నీ డ్యాన్సులతో, త్రివిక్రమ్ పంచ్ డైలాగ్‌లతో ఇరగ్గొట్టేశారు. బన్నీ, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. ఈ మధ్య కాలంలో ఇలాంటి మ్యూజికల్ హిట్ ఆల్బమ్‌ని చూడలేదు. ఒక్కో సాంగ్ 100 మిలియన్ క్రాస్ చేసింది. తమన్ రాకింగ్ మ్యూజిక్ ఇచ్చాడు అని దేవిశ్రీప్రసాద్ తమ `సరిలేరు నీకెవ్వరు` చిత్రానికి మంచి మ్యూజిక్‌ని అందించలేకపోయాడని ఇండైరెక్ట్‌గా చురకలంటించడం ఆసక్తికరంగా మారింది.