‘మన్మథుడు 2’: రాహుల్ రవీంద్రన్ కెలుక్కుని , తిట్టించుకున్నాడే

పాపం ‘మన్మథుడు 2’ డైరక్టర్ ని మళ్లీ జనం తిట్టిపోసారే

“ఆల్రెడీ థియోటర్ లో చూసి చచ్చాము, మళ్లీ ఇప్పుడు డేటా బొక్కా”

“తీసిందే పెద్ద కళాఖండం మళ్లీ పెద్ద బాహుబలి తీసినట్లు నీ మూవీ చూడాలా ? ”

“ఛల్ ఎవడు చూస్తాడు…మన్మధుడు ఎట్లా ఉండేది…దాని పరువు మొత్తం తీసేసావు ఈ మూవీతో…”

“పక్కకి వెళ్లి అడుక్కో కాకా..మళ్లీ ఇటు రాకు”

ఈ కామెంట్స్ చూస్తూంటే మీకేమనిపిస్తోందో కానీ పాపం దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కు మాత్రం విరక్తి పుట్టి ఉంటుంది. అతని తాజా చిత్రం మన్మధుడు 2 సినిమా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతోంది. ఈ నేపద్యంలో దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ .. రేపు నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతోంది. చూడండి అంటూ ట్వీట్ చేసాడు. దాంతో ఇదిగో జనం తమ కసి అంతా చూపిస్తూ ఇలా తగులుకున్నారు.

కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మన్మథుడు 2’. కీర్తి సురేష్, సమంత అక్కినేని, అక్షర గౌడ ప్రత్యేక పాత్రల్లో మెరిసిన ఈ చిత్రం ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. రిలీజైన రోజే నెగిటివ్ టాక్ తెచ్చుకుని డిజాస్టర్ అయ్యింది. అంతేకాక అంత చెత్త సినిమా తీసావంటూ డైరక్టర్ ని తిట్టిపోసారు. ఇప్పుడు మరోసారి ఈ దర్శకుడు ఇలా బలయ్యాడు.