మంచు లక్ష్మీ మరో కొత్త పోగ్రాం..క్రేజీనే
మంచు లక్ష్మీ ఓ పోగ్రామ్ చేస్తోందంటూ ఖచ్చితంగా అందులో కాస్తంత క్రేజ్, ఫన్ ,కాంట్రవర్శీ ఉంటుంది. ఆ మాత్రం డోస్ లేకపోతే ప్రేక్షకులకు కిక్ ఉండదని ఆమెకు తెలుసు. అందుకే ఇప్పుడు స్టార్స్ ..బెడ్ రూమ్ స్టోరీలు చెప్తానంటూ మన ముందుకు వస్తోంది. బెడ్ రూమ్ స్టోరీలంటే వేరే కథలు కాదు… సరదాగా కొన్ని సీక్రెట్స్ చెప్పీ చెప్పక ఊరిస్తారన్నమాట.
ఓ రకంగా అది స్టార్స్ కు పబ్లిసిటీ, ఛానెల్స్ కు టీఆర్పీ. మరి అందరి బెడ్ రూమ్ స్టోరీలు చెప్తానని మంచు లక్ష్మీ బయిలుదేరుతోంది. మరి ఆమె బెడ్ రూమ్ స్టోరీ సీక్రెట్స్ ఎవరు చెప్తారో అంటున్నారు ఆమె అభిమానులు. ఓ రోజు ఆమెతో కూడా వేరే వాళ్లు యాంకరింగ్ చేసి బెడ్ రూమ్ స్టోరీ చెప్తే బాగుంటుందని కదా అని వారి ఆలోచన.
ఇక షో విషయానికి స్టార్స్ నైట్ లైఫ్ ఎలాంటుందో ఈ షోలో చూపిస్తారు. సెలబ్రిటీల నైట్‌లైఫ్‌ను చూపించేందుకు త్వరలో తెలుగులో ఓ షో ప్రారంభం కానుంది. వయాకామ్18 వాళ్లు నిర్వహిస్తోన్న ఈ షోకి మంచులక్ష్మి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు.
మంచు లక్ష్మి మాట్లాడుతూ.. ‘‘ ఫూట్ అప్ విత్ స్టార్స్ తెలుగు వెర్షన్ హోస్ట్ చేస్తున్నందుకు చాలా ఎగ్జైటింగ్ గా ఫీలవుతున్నారు. ఈ షో ఫార్మాట్ చాలా యూనిక్ గా ఉంది. మన అభిమాన సెలబ్రిటీస్ ఫీలింగ్స్ ను, సీక్రెట్స్ ను తెలుసుకునేందుకు ఇది ఓ పర్ఫెక్ట్ సెట్టింగ్. తమ అభిమాన తారలను అభిమానులకు చాలా దగ్గరగా చేస్తూ చాలా ఫన్ గా ఈ షో ఉండేలా ప్రయత్నిస్తాను.
సెలబ్రిటీస్ లో నాకు చాలామంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు.. వాళ్లందరితోనూ చేసే సంభాషణల కోసం నేనూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నాను. నాకే కాదు..సెలబ్రిటీస్ కు కూడా ఇదో ఇంట్రెస్టింగ్ ఎక్స్ పీరియన్స్ మారబోతోంది. నేనూ ఈ షోకోసం చాలా వెయిట్ చేస్తున్నాను’’ అన్నారు.
ఈ నెల 23 నుంచి ప్రారంభం కాబోతోన్న ఈ షోకోసం ఇప్పటికే చాలామందికి నచ్చే తారలతో ఇంటర్యూస్ సిద్ధంగా ఉన్నాయని.. ఇలాంటి సెన్సేషనల్ షో కోసం మీకూ బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాం అని వయాకామ్ 18 ప్రతినిధులు చెప్పారు.