భ‌యంవ‌ద్దు.. అలా అని నిర్ల‌క్ష్యం వ‌ద్దు: చిరు

మెగా అభిమానికి మెగాస్టార్ భ‌రోసా

క‌రోనా.. యావ‌త్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న పేరిది. దీని భారిన ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నాయి. ఇండియాలో ఇప్ప‌టికే 169 కేసులు బ‌య‌ట‌ప‌డ‌టంతో నివార‌ణ చ‌ర్య‌ల‌పై ప్ర‌ముఖులు, సెల‌బ్రిటీలు ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు న‌డుం క‌ట్టారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఓ వీడియో సందేశాన్ని అందించారు. క‌రోనా బారిన ప‌డ‌కుండా ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలో, ఎలా క‌రోనా నుంచి సేఫ్‌గా బ‌య‌ట‌ప‌డాలో స‌ల‌హాలు సూచ‌న‌లు ఇచ్చారు.

అంద‌రికీ న‌మ‌స్కారం.. యావ‌త్ ప్ర‌పంచాన్ని భ‌యాందోళ‌న‌ల‌కు గురిచేస్తున్న స‌మ‌స్య క‌రోనా.అయితే మ‌న‌కేదో అయిపోతుందనే భ‌యం కానీ, మ‌న‌కేమీ కాద‌నే నిర్ల‌క్ష్యం మాత్రం ప‌నికిరాదు. జాగ్ర‌త్త‌గా వుండి ధైర్యంగా ఎదుర్కోవాల్సిన స‌మ‌య‌మిది. జ‌న స‌మూహానికి వీలైనంత దూరంగా వుండండి. దీని ప్ర‌భావం త‌గ్గే వ‌ర‌కు ఇంటికే ప‌రిమితం కావ‌డం ఉత్త‌మం అని పేర్కొన్న‌రు. దీనితో పాటు క‌రోనా బారిన ప‌డ‌కుండా వ్య‌క్తిగ‌తంగా ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలో వెల్ల‌డించారు.