బ‌న్నీ కోసం బాలీవుడ్ భామ‌ల డ్యాన్స్‌!

బ‌న్నీ కోసం ఇదద్ద‌రు బాలీవుడ్ భామ‌లు డ్యాన్స్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఆ ఇద్ద‌రూ అక్కా చెల్లెళ్లు కావ‌డం విశేషం. రెండు ద‌శాబ్ధాల క్రితం టాలీవుడ్ ని ఓ ఊపు ఊపేసిన శిల్పాశెట్టి గురించి ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. సాగ‌ర‌క‌న్య‌గా ఇప్ప‌టికీ అభిమానుల గుండెల్లో నిలిచే ఉంది ఈ బాలీవుడ్ బుట్ట‌బొమ్మ‌. లేటెస్టుగా శిల్పా శెట్టి త‌న సోద‌రితో క‌లిసి అల వైకుంఠ‌పుర‌ములో చార్ట్ బస్ట‌ర్ సాంగ్ `బుట్ట‌బొమ్మా….` సాంగ్ కి స్టెప్పులు వేయ‌డం.. ఆ వీడియో కాస్తా అభిమానుల్లో వైర‌ల్ అయిపోవ‌డం వేడెక్కించింది. ఇంత‌కీ సిస్ట‌ర్స్ కి ఉన్న‌ట్టుండి ఏమైంది? అన్న సందేహం బ‌న్ని అభిమానుల్లో వ్య‌క్త‌మ‌వుతోంది.

`అల వైకుంఠపుర‌ములో` మ్యూజిక‌ల్ ఆల్బ‌మ్ సంచ‌ల‌నాలు న‌మోదు చేసింది. ఈ ఆల్బ‌మ్ నుంచి రాములో రాములా.., బుట్ట‌బొమ్మ‌…., సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌.. పాటలు శోతల్నిబాగా ఆక‌ట్టుకున్నాయి. యూ బ్యూబ్ ప్రేక్ష‌కుల్ని ఆ పాట‌ల వీడియోలు మ‌రింత‌గా అల‌రించాయి. సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచిన పాట‌లుగా రికార్డు సృష్టించాయి. సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న పాట అయితే రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ తో యూ ట్యూబ్ లో సంచ‌ల‌నమే అయ్యింది. అత్య‌ధిక వ్యూస్ తో సౌత్ లోనే బ్లాక్ బ‌స్ట‌ర్ సాంగ్ గా నిలిచింది. ఇక ఇదే ఆల్బ‌మ్ లో బుట్ట బొమ్మ సాంగ్ శ్రోత‌ల‌కు బాగా రీచ్ అయింది. అందులో బ‌న్నీ,పూజాహెగ్దే స్టెప్పులకు మంచి ఫాలోయింగ్ ఏర్ప‌డింది. ముఖ్యంగా పూజాకి అచ్చం బుట్ట‌బొమ్మ‌ను త‌ల‌పించే కాస్ట్యూమ్స్ ప‌క్కాగా కుదిరేయ‌డంతో విజువ‌ల్ గా ఆ పాట బాగా వైర‌ల్ అయింది. డీజే చార్ట్ బ‌స్ట‌ర్ గుడిలో బ‌డిలో మ‌డిలో సాంగ్ త‌ర‌హాలోనే యూట్యూబ్ మార్కెట్లో బుట్ట‌బొమ్మ పాట స్టెప్పుల‌ను మ‌క్కీ మ‌క్కీ దించేస్తున్నారు. బుట్ట‌బొమ్మ‌ను టిక్ టాక్ లు చేసి అల్లాడిస్తున్నారు. దీంతో సాంగ్ మ‌రింతగా ఫేమ‌స్ అయిపోతోంది. తాజాగా బాలీవుడ్ న‌టి శిల్పాశెట్టి బుట్ట‌బొమ్మ స్టెప్పుల‌ను టిక్ టాక్ వీడియోగా మ‌లిచి సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేసింది.

పూజా స్పెప్పుల‌ను సాగ‌ర‌క‌న్య శిల్పాశెట్టి అచ్చంగా దించేసింది. ఇప్పుడా టిక్ టాక్ వీడియో సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతోంది. దీన్ని బ‌ట్టే అల వైకుంఠ‌పుర‌ములో పాట‌లు పాన్ ఇండియా స్థాయికి చేరుకున్నాయ‌ని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. అదంతా స‌రే కానీ.. శిల్పాశెట్టితో పాటు ఆ వీడియోలో త‌న సిస్ట‌ర్ ష‌మితాశెట్టి వేసిన స్టెప్పులు కుర్ర‌కారు గుండెల్లో గిలిగింత‌లు పెట్టేశాయి. చిట్టి పొట్టి నిక్క‌రులో ష‌మితా ఇచ్చిన ఎక్స్ ప్రెష‌న్స్ కిక్కు పెంచాయి. అయితే చీర‌లో ఆర‌డుగుల బుల్లెట్టులా ఉన్న శిల్పా విన్యాసాల ముందు అవ‌న్నీ చిన్న‌బోయాయి అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. అయితే సౌత్ లో అంద‌రూ మర్చిపోయిన ష‌మితా, శిల్పాశెట్టి ఇలా బ‌న్నీ కోసం డ్యాన్సులు చేయ‌డం దేనికి సంకేత‌మ‌ని ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది.