బ‌న్నీ `ఐకాన్‌`పై క్లారిటీ వ‌చ్చేసింది!

బ‌న్నీ – సుకుమార్‌ల క‌ల‌యిక‌లో వ‌స్తున్న చిత్రానికి బుధ‌వారం `పుష్ప‌` అనే టైటిల్ చిత్ర బృందం నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే. అల్లు అర్జున్ పుట్టిన రోజుని పుర‌స్క‌రించుకుని ఫస్ట్‌లుక్ పోస్ట‌ర్‌ని, టైటిల్ లోగోని రిలీజ్ చేశారు. ఫ‌స్ట్‌లుక్‌లో అంతా ఊహించిన‌ట్టే బ‌న్నీ మాసీవ్ లుక్‌లో అద‌ర‌గొట్టేశాడు.
ర‌గ్గ్‌డ్ లుక్‌లో అత్యంత స‌హ‌జ‌త్వానికి ద‌గ్గ‌ర‌గా బ‌న్నీ పాత్ర వుంటుంద‌ని అర్థ‌మ‌వుతోంది.

మైత్రీ సంస్థ‌తో క‌లిసి ఇటీవ‌లే చ‌నిపోయిన బ‌న్నీ మేన‌మామ‌కు చెందిన ముత్యంశెట్టి మీడియా కూడా ఈ చిత్రానికి ఓ భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రిస్తోంది. శేషాచ‌లం అడ‌వుల్లో గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇదిలా వుంటే బ‌న్నీ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఇటీవ‌ల వైర‌ల్ అవుతున్న ఓ రూమ‌ర్‌కు దిల్ రాజు చెక్ పెట్టేశాడు.

అల్లు అర్జున్‌తో దిల్ రాజు `ఐకాన్‌`పేరుతో ఓ సినిమాని తెర‌పైకి తీసుకురావాల‌ని ప్లాన్ చేసిన విష‌యం తెలిసిందే. వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌కత్వంలో ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకురావాల‌నుకున్నారు. అయితే మహేష్ షాకివ్వ‌డంతో వెంట‌నే బ‌న్నీని ఒప్పించిన సుకుమార్ కార‌ణంగా ఈ చిత్రాన్ని ప‌క్క‌న పెట్టేశార‌ని ప్ర‌చారం జ‌రిగింది. తాజాగా ఆ ప్ర‌చారంలో ప‌స లేద‌ని. బ‌న్నీతో `ఐకాన్‌` ఆగిపోలేద‌ని దిల్ రాజు క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాడు. బ‌న్నీకి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూనే ఐకాన్ పోస్ట‌ర్‌ని ట్వీట్ చేయడంతో రూమ‌ర్‌ల‌కు చెక్ పెట్టేశారు దిల్ రాజు.