తెరు ముందు రికార్డులు జస్ట్ పాసింగ్ క్లౌడ్స్ మాత్రమే.. ఒక సినిమాతో వస్తుంటాయి.. మరో సినిమాతో ఉడిచిపెట్టుకుపోతుంటాయి..అంటూనే తెర వెనుక స్టార్ హీరోలు చేస్తున్న ప్లాన్స్ ఇండస్ట్రీ వర్గాలకు దిమ్మదిరిగేలా చేస్తున్నాయి. మీడియా ముందు ఫ్యాన్స్ ముందు ముఖస్థితికి రికార్డ్స్ మాకు లెక్కకాదంటూనే తెర వెనుక మాత్రం వాటి కోసం మాస్టర్ ప్లాన్స్ వేయడం అందు కోసం ఏకంగా ఓ టీమ్‌ని అపాయింట్ చేసుకోవడం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ సంక్రాంతికి ఇద్దరు స్టార్ హీరోల చిత్రాలు పోటీపడ్డాయి కానీ ఒక సినిమా మాత్రమే మీడియాలోనూ, యూట్యూబ్‌లోనూ సంచలనాలు సృష్టించింది వార్తల్లో నిలిచింది. దాని వెనక సినిమాలో వున్న స్టాఫ్ కారణం అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. మహేష్ నటించిన `సరిలేరు నీకెవ్వరు`, అల్లు అర్జున్ నటించిన `అల వైకుంఠపురములో` చిత్రాలు ఒక్క రోజు తేడాతో విడుదలయ్యాయి. అల్లు అర్జున్ సినిమా, పాటలు ఎంత బాగున్నా మిలియన్‌ల వ్యూస్ రావడం అన్నది అసాధ్యం. అలాంటి అసాధ్యాన్ని బన్నీ ప్రత్యేక టీమ్ సుసాధ్యం చేసిచూపించింది.
18 నెలల విరామం తరువాత బన్నీ నుంచి వస్తున్న సినిమా. హిట్ లేక రేసులో వెనకబడిపోయిన బన్నీ తనకంటే జూనియర్‌లు వరుస హిట్‌లు కొట్టడం తట్టుకోలేకపోయాడట. ఆ ఫ‌్రస్ట్రేషన్‌లో ఓ టీమ్‌ని రెడీ చేశాడని, ఈ సారి ఇండస్ట్రీ హిట్ తనదే అనిపించుకోవాలని, దీని కోసం ఏం చేస్తావో నాకు తెలియదు జరిగిపోవాలంతే అని బన్నీవాసుకి కండీషన్‌లు పెట్టడట బన్నీ. దాంతో సోషల్ మీడియా, యూట్యూబ్‌పై మంచి పట్టున్న కొంత మందిని సెలెక్ట్ చేసుకుని టీమ్‌లో రిక్రూట్ చేసి వారి ద్వారా మరో వందకు పైగా యూట్యూబ్ ఛానల్స్‌ని కూడా రంగంలోకి దింపారట.
`అల వైకుంఠపురములో` చిత్రానికి సంబంధించి ఎలాంటి వార్త వచ్చినా, వీడియో పోస్ట్ అయినా అది వైరల్ అయ్యేలా ప్లాన చేశారట. ఇదే సమయంలో `సరిలేరు..`ని తొక్కే ప్రయత్నాలు కూడా ఓ రేంజ్‌లో చేశారని ఇండస్ట్రీ టాక్. బన్నీ టీమ్ వల్లే పాటల్లో దమ్మున్నా మిలియన్ వ్యూస్ సాధ్యమైందని, ఆ పని `సరిలేరు టీమ్ చేయలేకపోయిందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. బన్నీ టీమ్ ఎంత వరకు వెళితే ఇండస్ట్రీ హిట్ అనే ట్యాగ్ బన్నీ సినిమాకు వస్తుందో అంత వరకు వెళ్లారని, ఇండర్ కరెంట్‌లో ఓ మిషన్‌లా పనిచేశారని అందుకే ఇండస్ట్రీ హిట్ బన్నీకి సాధ్యమైందని గుసగుసలు వినిపిస్తున్నాయి.