బ‌న్నీసెల‌బ్రేష‌న్ మామూలుగా లేదుగా!

`నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` ఫ్లాప్‌తో షాక్‌కు గురైన బ‌న్నీ 18 నెల‌ల విరామం త‌రువాత బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ రూపొందించిన చిత్రం `అల వైకుంఠ‌పుర‌ములో`. అల్లు అర్జున్ న‌టించిన ఈ చిత్రం ఈ నెల 12న సంక్రాంతి బ‌రిలో నిల‌చి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే.

ఊహించిన దానికి మించి సినిమా హిట్ కావ‌డం, అదీ సంక్రాంతి బ‌రిలో త‌న‌ని విన్న‌ర్‌గా నిల‌బెట్ట‌డంతో బ‌న్నీ సెల‌బ్రేష‌న్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. ప్ర‌రంభ వ‌సూళ్ల ప‌రంగానూ రికార్డులు సృష్టిస్తుండ‌టంతో బ‌న్నీ ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. దీంతో మెగా ఫ్యామిలీతో క‌లిసి ఈ సంక్రాంతిని సెల‌బ్రేట్ చేసుకున్నారు. బుధ‌వారం రాత్రి నిర్వ‌హించిన ఈ కార్య‌క్ర‌మంలో అల్లు, మెగా కుటుంబాలు పాల్గొన్నాయి.

ఈ సంద‌ర్భంగా ఆర్కెస్ట్రాని నిర్వ‌హించారు. ఇందులో `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంలోని `సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌… రాములో రాములా.. గీతాల్నిఆర్కెస్ట్రా టీమ్ ఆల‌పించింది. ఈ పాట‌లు పాడుతున్న సంద‌ర్భంలో `సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న.. పాట‌ని అల్లు అర్జున్ త‌న భార్య స్నేహ కోసం ఆల‌పించ‌డం అక్క‌డున్న వారిని ఆక‌ట్టుకుంది. బ‌న్నీ పాడుతుండ‌గా వైఫ్ స్నేహారెడ్డి సిగ్గులొలికిస్తున్న వీడియోని అల్లు శిరీష్ సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడ‌ది వైర‌ల్‌గా మారింది.