బ్ర‌హ్మానందం, అలీ చేతుల మీదుగా గుణ 369`లోని `బుజ్జి బంగారం…` పాట విడుద‌ల‌!

RX100ఫేమ్ కార్తికేయ, అన‌ఘ జంట‌గా అర్జున్ జంధ్యాల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రంగుణ 369. శ్రీమ‌తి ప్ర‌వీణ క‌డియాల స‌మ‌ర్ప‌ణ‌లో స్ప్రింట్‌ ఫిలిమ్స్‌, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌జీ మూవీ<br />
మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి నిర్మాతలు. ఈ చిత్రంలోని తొలి పాట‌ను ఇటీవ‌ల స్టార్ ప్రొడ్యూస‌ర్
దిల్‌రాజు విడుద‌ల చేశారు. రెండో పాటబుజ్జి బంగారం…ను సోమ‌వారం హైద‌రాబాద్‌లో ప్ర‌ముఖ హాస్య న‌టులు బ్ర‌హ్మానందం, అలీ విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్‌ను బ్ర‌హ్మానందం ఆశీర్వ‌దించారు. అనంత‌రం అలీ మాట్లాడుతూ ``చైత‌న్ భ‌ర‌ద్వాజ్ స్వ‌ర‌ప‌ర‌చిన ఈ పాట చాలా బావుంది. ఈ చిత్రం కార్తికేయ‌కు RX100 క‌న్నా పెద్ద హిట్ కావాలి అని చెప్పారు.
హీరో కార్తికేయ మాట్లాడుతూ “ప్రేమ‌లో ఉన్న ప్ర‌తి అమ్మాయి, అబ్బాయి పాడుకునేలా ఉంది మా బుజ్జి బంగారం... పాట‌. ఎవ‌రైనా విన‌గానే మంచి స్టెప్పులు వేసేలా ఉంది. కామెడీ లెజండ్స్ బ్ర‌హ్మానందంగారు బ్లెస్ చేయ‌డం, అలీగారు పాట‌ను లాంచ్ చేయ‌డం గొప్ప అనుభూతిని క‌లిగిస్తోంది. ఇద్ద‌రు యాక్టింగ్ లెజెండ్స్ బ్లెస్సింగ్స్ అందుకోవ‌డం అదృష్టంగా భావిస్తున్నా. ఎంతో అదృష్టం చేసుకుంటే త‌ప్ప ఇలాంటి అరుదైన అవ‌కాశం దొర‌క‌ద‌ని నాకు తెలుసు. పెద్ద‌ల ఆశీస్సులందుకున్న ఈ సినిమా త‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తుంద‌ని న‌మ్ముతున్న” అని అన్నారు.
ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ నాలుగ్గోడ‌ల మ‌ధ్య ఊహించి రాసుకున్న క‌థ‌తో ఈ చిత్రాన్ని తీయ‌లేదు. విశాల ప్ర‌పంచంలో జ‌రిగిన య‌థార్థ‌గాథ మా చిత్రానికి ముడి స‌రుక‌య్యింది. స్క్రీన్ మీద కూడా అంతే స‌హ‌జంగా ఉంటుంది. ఆ నేచురాలిటీ ప్రేక్ష‌కుడి గుండెను తాకుతుంది. కామెడీ లెజెండ్స్ ఇద్ద‌రి చేతుల మీదుగా మా<br />
చిత్రంలోని రెండో పాట `బుజ్జి బంగారం` విడుద‌ల కావ‌డం ఆనందంగా ఉంది. వారి పాజిటివ్ మాట‌లు మాలో కొత్త ఉత్తేజాన్ని నింపాయి
అని అన్నారు. ఆగ‌స్ట్ 2న చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం“ అని అన్నారు.