బ్రేకింగ్‌: `ఆర్ ఆర్ ఆర్` ఏరియా వైజ్ బిజినెస్‌!

జ‌క్క‌న్న `ఆర్ ఆర్ ఆర్` దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ఈ సినిమా కార‌ణంగా యావ‌త్ భార‌తీయ సినీ దిగ్గ‌జాలు టాలీవుడ్ వైపు ఏం జ‌ర‌గ‌బోతోందా? అని ఆశ్చ‌ర్యంతో చూస్తున్నారు. తొలి సారి ఇద్ద‌రు టాప్ స్టార్‌ల‌ని ఏకం చేసి రాజ‌మౌళి చ‌రిత్ర పుట‌ల్లో నిలిచిపోయిన‌ ఇద్ద‌రు పోరాట యోధుల క‌థని తెర‌పైకి తీసుకొస్తుండ‌టంతో ఈ సినిమా స‌ర్వ‌త్రా సంచ‌ల‌నంగా మారింది. ఇదిలా వుంటే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీరిలీజ్ బిజినెస్ యావ‌త్ దేశ వ్యాప్తంగా కొత్త రికార్డుల్ని తిర‌గ‌రాస్తోంది.

ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా ప్రిరిలీజ్ బిజినెస్ 215 కోట్లు జ‌రిగిన‌ట్లు తాజాస‌మాచారం. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన బిజినెస్ ప్ర‌కారం మొత్తం 400 కోట్లు దాటిన‌ట్టు తెలుస్తోంది. ఇదే నిజ‌మైతే `బాహుబ‌లి 2` ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో సాధించిన వ‌సూళ్ల‌ రికార్డ్ ని `ఆర్ ఆర్ ఆర్` బిజినెస్ రూపంలో అదిగమించిన‌ట్టే.
ఉభ‌య తెలుగు రాష్ట్రాల ఏరియాల‌తో పాటు ఓవ‌ర్సీస్, క‌ర్ణాట‌క‌, కేర‌ళ రైట్స్ వివ‌రాలు ఇలా వున్నాయి.

నైజామ్ – దిల్‌రాజు రూ. 75 కోట్లు

సీడెడ్ – సాయి కొర్ర‌పాటి రూ. 40 కోట్లు

వైజాగ్ – సాయి కొర్ర‌పాటి రూ. 24 కోట్లు

ఈస్ట్ గోదావ‌రి – భ‌ర‌త్ చౌద‌రి అండ్ కో రూ. 19 కోట్లు

వెస్ట్ గోదావరి – ప్ర‌వీణ్ అండ్ కో రూ. 16 కోట్లు

కృష్ణా – మైత్రీ మూవీమేక‌ర్స్ రూ. 15 కోట్లు

గుంటూరు – యువీ క్రియేష‌న్స్ రూ. 18 కోట్లు

నెల్లూరు – సుధాక‌ర్ రూ. 9 కోట్లు

క‌ర్ణాట‌క – రూ . 50 కోట్లు

కేర‌ళ – రూ. 15 కోట్లు

ఓవ‌ర్సీస్ రూపంలో మ‌రో 70 కోట్లు..

వీటికి తోడు త‌మిళ వెర్ష‌న్ రూపంలో మ‌రింత మొత్తం వ‌చ్చే అవ‌కాశాలు వున్నాయ‌ని ఇంకా హిందీతో పాటు ఇత‌ర భాష‌ల‌కు సంబంధించిన బిజినెస్ ఇంకా ప్రారంభం కాలేద‌ని, అందులో హిందీపై ఇంకా క్లారిటీ రాలేద‌ని, ఇవ‌న్నీ ఫైన‌ల్ అయితే ఐదు వంద‌ల కోట్లు దాటినా ఆశ్చ‌ర్యం లేద‌ని ట్రేడ్ వ‌ర్గాల్లో వినిపిస్తోది. ఒక సౌత్ సినిమాకు. అందులోనూ తెలుగు సినిమాకు రిలీజ్‌కు ముందే ఈ స్థాయిలో ప్రీరిలీజ్ బిజినెస్ జ‌ర‌గ‌బోతుండ‌టం ద‌క్షిణాది సినీ చ‌రిత్ర‌లోనే మొట్ట‌మొద‌టి సార‌ని, ఇది ఓ రికార్డుగా చ‌రిత్ర‌లో మిగిలిపోనుంద‌ని ట్రేడ్ విశ్లేష‌కులు అభిప్రాయ పడుతున్నారు.