సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్, రాశీ ఖన్నా హీరోహీరోయిన్లుగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ బ్యానర్ల పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్కేఎన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. జయకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా రాశీఖన్నా శనివారం మీడియాతో ముచ్చటించారు. ఈ చిత్రంలో నా పాత్ర పేరు ఏంజిల్ ఆర్నా. ఇందులో హీరోయిన్ పాత్రకి టిక్‌టాక్ పిచ్చి ఉంటుంది. బేసిక్‌గా నాకు ఈ సినిమా మొదలవకముందు టిక్‌టాక్ అంటే ఇష్టముండేది కాదు. ఎందువల్లనంటే దాని వల్ల చాలా మంది చనిపోవడం లాంటివి చూడడంతో నాకు అస్సలు ఇష్టముండేది కాదు. కానీ మారుతి ఈ సినిమాలో దాన్ని ఒక హాస్యాస్పదంగా మార్చి చూపించడంతో టిక్ టాక్ పై నాకున్న ఆలోచన కాస్త మారింది. మారుతిగారికి ప్రేక్షకుల నాడిని బాగా అంచనా వేయగలరు. నేను ఇందులో రాజమండ్రి వాసిగా చేశాను. ఈ సినిమాకు డబ్బింగ్ చెబుదామనుకున్నా కాని అక్కడి స్మాంగ్ మాట్లాడటం కాస్త కష్టమనిపించింది. ప్రియాంక చాలా బాగా డబ్బింగ్ చెప్పింది. నాకు సెల్ఫీలన్నా కూడా పెద్దగా ఇష్టముండదు. ఇందులో నేను నటించేది చాలా అరుదైన పాత్ర అలాగే చాలా ప్రత్యేకమైనది కూడా. నా ఫ్రెండ్స్‌లో కూడా ఎవ్వరూ టిక్ టాక్ చెయ్యరు. వెంకీ మామలో నేను కొంచం గ్లామర్ పాత్ర మోడ్రన్‌గా కనపడ్డాను. ఇందులో ట్రెడిషనల్‌గా కనపడతాను. వెంకీమామ క్యారెక్టర్ చెయ్యడం కాస్త కష్టమనిపించింది ఎందుకంటే నేను ఎప్పుడూ అంత మోడ్రన్ క్యారెక్టర్‌లో కనపడలేదు. సుప్రీం చిత్రంఓల బెల్లం శ్రీదేవి క్యారెక్టర్ కి ఎంత మంచి పేరు వచ్చిందో ఈ చిత్రంలో కూడా అంత మంచి పేరు వచ్చింది. అలాగే ఇందులో ఏదో సరదాగా ఒక సాంగ్ పాడుతుంటే మారుతిగారు నా వాయిస్ సూట్ అయిందని పాడమన్నారు. ఈ చిత్రంలో ఒక్క సాంగ్ మాత్రమే కొంచం మోడ్రన్‌గా ఉంటుంది. మిగతా సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్మెంట్‌గా ఉంటుంది. నేను నటించిన ప్రతి హీరోతోనూ ఫ్రండ్లీగానే ఉంటాను. అలాగే అందరితోనూ తిరిగి నటించాలనిపిస్తది. ఇక మారుతి చాలా చాలా మంచి వ్యక్తి ఆయన చాలా సరదాగా ఉంటూ పని చేయించుకుంటారు. తనకు ఏం కావాలన్నది ఒక క్లారిటీతో ఉంటారు. ప్రస్తుతం ప్రతిరోజు పండగ, వరల్డ్ ఫేమస్‌లో చేస్తున్నాను. అవి రెండూ విడుదలయ్యాక తర్వాత చిత్రం గురించి ఆలోచిస్తాను.