లాక్‌డౌన్ కారణంగా సమాన్యులు, సెలబ్రిటీలు అంతా ఇంటికే పరిమితం అయిపోయారు. సినీ స్టార్‌లు చాలా ఇబ్బందికర వాతావరణాన్ని ఎదుర్కొంటున్నారు. నిత్యం షూటింగ్‌లతో క్షణం తీరిక లేకుండా గడిపిన వారికి ప్రస్తుతం ఏమీ పని లేకపోవడంతో ఏమీ తోచడం లేదు. సినిమాల నిర్మాణం, రిలీజ్‌లు కూడా ఆగిపోయాయి. పబ్లిక్‌తో ఇంటరాక్ట్ కావాలంటే వారికున్న ఏకైక మార్గం సోషల్ మీడియా దీంతో సోషల్ మీడియాలో లైవ్ చిట్ ఛాట్‌లకు సిద్ధమవుతున్నారు.
మెగా డాటర్ కొణిదెల నిహారిక కూడా అభిమానులతో ముచ్చటించడానికి ఇన్ స్టా లైవ్‌లో ప్రత్యక్షమైంది. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానలు చెప్పింది. ఈ సందర్భంగా ఓ అభిమాని పెళ్లి తరువాత నటిస్తారా? అని ప్రశ్నించడంతో షాకింగ్ సమాధానం చెప్పింది. ప్రస్తుతం తనకు చాలా తక్కువ సమయమే వుందని, వీలైనంత వరకు వచ్చిన ఆఫర్‌లని వాడుకుని నచ్చిన చిత్రాల్లో నటించాలని ఎదురుచూస్తున్నానని వెల్లడించింది.
పెళ్లి తరువాత నటన గురించి మాట్లాడుతూ `నేను మన్నా సమంతనా పెళ్లి తరువాత కూడా నటించడానికి అంటూ షాకిచ్చింది. ఆమెలా పెళ్లి తరువాత నటించలేనని, అయితే ఆ విషయం అప్పుడే చెప్పలేనని స్పష్టం చేసింది. త్వరలో ఓ తమిళ సినిమా చేయబోతున్నానని, అందులో చాలా రొమాంటిక్‌గా కనిపిస్తానని, గోవా బీచ్ నేపథ్యంలో సినిమా వుంటుందని, రొమాంటిక్ సన్నివేశాలు చాలానే వుంటాయని చెప్పింది. అయితే మధ్యలోకి సమంత ప్రస్థావన తీసుకురావడంతో అక్కినేని ఫ్యాన్స్ నిహారికపై గుర్రుగా వున్నారట.