బిగ్ బ్రేకింగ్‌: గాయ‌ప‌డిన‌ ర‌జ‌నీకాంత్‌

త‌లైవా ర‌జ‌నీకాంత్ గాయ‌ప‌డ్డారు. ఓ డాక్యుమెంట‌రీ షూటింగ్ కోసం మైసూర్‌లోని బండీపూర్ అడ‌వుల‌కు వెళ్లిన ఆయ‌న అదుపు త‌ప్పి కింద‌ప‌డిపోవ‌డంతో స్వ‌ల్ప‌గాయాలైన‌ట్టు తెలుస్తోంది. గ‌త ఏడాది భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీలో డిస్క‌వ‌రీ ఛాన‌ల్‌కు చెందిన బేర్ గ్రిల్స్ `మ్యాన్ వ‌ర్సెస్ వైల్డ్‌` కోసం ఓ డాక్యుమెంట‌రీని చిత్రీక‌రించిన విష‌యం తెలిసిందే.

ఈ ఏడాది త‌మిళ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌తో మ‌రో డాక్యుమెంట‌రీని ప్లాన్ చేశాడు బేర్‌గ్రిల్స్‌. డిస్క‌వ‌రీ ఛాన‌ల్ కోసం అనే స‌రికి త‌న తాజా చిత్ర షూటింగ్‌కి బ్రేకిచ్చిన ర‌జ‌నీకాంత్ మంగ‌ళ‌వారం నుంచి డాక్యుమెంట‌రీ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఇందు కోసం మంగ‌ళ‌వార‌మే మైసూర్‌లోని బండీపూర్ టైగ‌ర్ రిజ‌ర్వ్ ఫారెస్ట్‌కు చేరుకున్న ర‌జ‌నీ షూటింగ్ చేస్తుండ‌గానే అదుపు త‌ప్పి కింద‌ప‌డిపోయార‌ట‌. దీంతో ఆయ‌న‌కు స్వ‌ల్ప గాయాల‌య్యాయిని, వెంట‌నే ఆయ‌న‌ని హుటా హుటిన ఆసుప‌త్రికి త‌ర‌లించార‌ని తెలిసింది. ఊహించ‌ని ప‌రిణామం ఎదుర‌వ్వ‌డంతో కంగుతిన్న త‌లైవా డిస్క‌వ‌రీ ఛాన‌ల్ డాక్యెమెంట‌రీని మ‌ధ్య‌లోనే ఆపేసి చెన్నై తిరిగి వెళ్ల‌బోతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.