బిగ్ బాస్ 3 హోస్ట్ గా కింగ్ నాగార్జున

బిగ్ బాస్ రియాలిటీ షో ఎంత విజయవంతం అయిందో చెప్పేదేముంది. బిగ్ బాస్ మొదలైందంటే టీవీ లన్నీ మా ఛానల్ పైనే లాక్ అయిపోతాయి. ఉత్కంఠగా సాగే ఈ షో, అందులో ప్రజల ఇష్టమైన సెలబ్రిటీల తో షో జనరంజకంగా ఉంటుంది. అటువంటి సిరీస్ కి మొదట ఎన్ఠీఆర్, ఆ పైన నాని హోస్ట్ గా ఉన్నారు.
ఇప్పుడు సీసన్ 3 కి కింగ్ నాగార్జున ని హోస్ట్ గా ప్రకటించారు. నాగార్జున కి ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. ఆ పైన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ తో మన ఇంట్లో వ్యక్తిలా ఆదరణ చూరగొన్నాడు. మళ్ళీ ఈ రియాలిటీ షో తో ఎలాంటి మాయ చేస్తాడో చూడాలి. ఖచ్చితంగా నాగార్జున బిగ్ బాస్ త్రీ ని మరో స్థాయికి తీసుకువెళతారు అనడంలో సందేహం లేదు.