బిగ్ బాస్ టైమింగ్స్ లో మార్పు .. ఈ రోజు నుండి ఆ సమయంలో వస్తుంది !

Bigg Boss 4 Telugu Week 11 Nagarjuna About Total Votes

బిగ్ బాస్ ఎప్పుడొస్తుంది అని ఎవరిని అడిగినా కూడా రాత్రి 9 గంటల 30 నిమిషాలకు అని చెప్తాడు. ఎందుకంటే తెలుగు ఆడియన్స్‌కు అంతగా కనెక్ట్ అయిపోయింది బిగ్ బాస్ రియాలిటీ. బిగ్ బాస్ కి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

వీకెండ్ వచ్చిందంటే టిఆర్పీ కూడా టాప్ లో కొనసాగుతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు బిగ్ బాస్ టైమింగ్స్‌లో మార్పులు మొదలయ్యాయి. మరో 14 రోజుల్లో పూర్తయ్యే షోకు ఇప్పట్నుంచే మరమ్మత్తులు మొదలు పెట్టారు స్టార్ మా యాజమాన్యం.

avinash eliminated from the bigg boss house on sunday
 

సమయం ముగిసిన తర్వాత కొత్తవి వెతుక్కునే కంటే కూడా.. ముందు నుంచే బిగ్ బాస్ స్థానంలో ఏది రీ ప్లేస్ చేయాలో సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇకపై బిగ్ బాస్ రాత్రి 9.30 నిమిషాలకు కాకుండా మరో అరగంట ఆలస్యంగా వస్తుంది. డిసెంబర్ 7 నుంచి రాత్రి 10 గంటలకు బిగ్ బాస్ ప్రసారం కానుంది. బిగ్ బాస్ వచ్చే సమయంలో వదినమ్మ సీరియల్ రానుంది.

వదినమ్మ వచ్చే 7 గంటలకు ఇప్పుడు గుప్పెడంత మనసు అనే కొత్త సీరియల్ మొదలు కానుంది. డిసెంబర్ 7 నుంచి ఈ మార్పులు చేర్పులు మొదలు కానున్నాయి. ఇప్పటికే స్టార్ మాలో అందరితోనూ ఈ ప్రమోషన్ చేయిస్తున్నారు నిర్వాహకులు. మరో రెండు వారాలు మాత్రమే షో ఉండటంతో ఇప్పట్నుంచే మార్పులు మొదలు పెట్టింది సదరు ఛానెల్. ఇప్పటికే జనాల్లోకి షో వెళ్లిపోయింది కాబట్టి ఇప్పుడు టైమింగ్స్ మార్చినా కూడా వచ్చే ప్రమాదం ఏం లేదని నమ్ముతున్నారు. వీకెండ్స్ మాత్రం టైమ్ లో మార్చలేదు.