బాలకృష్ణ నటించిన రీసెంట్ ఫిల్మ్ `రూలర్` చాలా నిరుత్సాహపరిచింది. కె.యస్. రవికుమార్ రూపొందించిన ఈ చిత్రం వచ్చిన విషయమే ఇంకా ఎవరికి తెలియదు కూడా. ఈ సినిమా బాలయ్య ఇంత వరకు కనిపించని విచిత్రమైన గెటప్‌లో కనిపించారు. విగ్గు మరీ దారుణంగా వుందనే విమర్శలు వచ్చాయి. దీంతో బాలయ్య హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీ చేయించుకున్నారు. అది తాజాగా వికటించినట్టు తెలుస్తోంది. ఇప్పటికీ నో రిజల్ట్. బాలయ్యకు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీ చేసిన డాక్టర్లు హెయిర్ పెరిగేంత వరకు ఆపరేషన్ చేసిన భాగాన్ని విగ్గుతో కప్పేయకండని చెప్పారట.
దాని కారణంగానే బాలయ్య ఈ మధ్య ఎలాంటి విగ్గు. చివరికి టోపీ లేకుండా బాల్డ్ హెడ్డుతో బయట తిరుగుతూ కనిపించారు. అయితే తాజాగా హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీ ఫెయిల్ అయిందని తెలిసింది. బోయపాటి సినిమా కోసం బాలయ్య మరోసారి హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీ చేయించుకోబోతున్నారట. బాలీవుడ్ హీరోలు విదేశాల్లో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీ చేయించుకుని సక్సెస్ అయ్యారు. అలాగే తానూ సక్సెస్ అయి విగ్గులని పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నారట. మరి ఈసారైనా బాలయ్య ప్రయత్నం ఫలిస్తుందేమో చూడాలి.