బాలయ్య చిత్రం – థాయ్‌లాండ్‌ షెడ్యూల్‌ పూర్తి

బాలకృష్ణ 105వ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో హ్యాపీ మూవీస్‌ బ్యానర్‌ పై సి.కల్యాణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన బాలకృష్ణ న్యూ లుక్‌ కొత్తగా ఉందని అందరూ ప్రశంసించారు.

థాయ్‌లాండ్‌లో ప్రారంభమైన ఈ సినిమా తొలి షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తయ్యింది. చిత్ర 20 రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్‌లో రెండు పాటలు, కొంత టాకీపార్ట్‌, భారీ పోరాట సన్నివేశాలను చిత్రీకరించారు.

సోనాల్‌ చౌహాన్‌, వేదిక కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రకాశ్‌రాజ్‌, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చిరంత‌న్ భ‌ట్‌ సంగీత దర్శకత్వం చేస్తున్నారు.