బాలయ్య అఘోరాగా ఏంటి బోయ‌పాటీ?

నందమూరి అభిమానులకు షాకిచ్చేలా తొలి సారి బాలకృష్ణ ఓ షాకింగ్ గెటప్ లో కనిపిస్తాడంటూ వస్తున్నా వార్తలు టాలీవుడ్ లో పెద్ద దుమారం రేపుతున్నాయి. లేటెస్ట్ గా `రూలర్` ప్లాప్ తరువాత బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను తో చేస్తున్న విషయం తెలిసిందే. సింహా, లెజెండ్ లాంటి సంచలన విజయాల తరువాత వీరిద్దరి క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే హై ఎక్స్పెక్టషన్స్ ఉన్నాయి. ఆ అంచనాలను అందుకునేలా బోయపాటి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమాలో బాలయ్య రెండు గెటప్‌ల‌లో కనిపిస్తాడట. అందులో ఒకటి ఇంటర్వెల్లో రివీల్ అయ్యే పాత్రే అఘోర. బాలయ్య ఏంటి..అఘోర గెటప్ లో కనిపించడం ఏమిటి ? అని అంతా షాక్‌కు గుర‌వుతున్నారు.

బాలయ్య అఘోర గెటప్ లో కనిపిస్తాడని, అందుకోసమే అయన గుండు చేయించుకున్నాడని ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ మధ్య బాలయ్య అందరికి షాక్ ఇచ్చేలా గుండు గెటప్ లో కనిపిస్తున్నాడు. అయితే గుండు తో ఉన్నది నెక్స్ట్ సినిమా కోసమా లేక .. అయన హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకునేందుకు అలా కనిపిస్తున్నాడా? అన్నది సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తున్న అంశం. ఈ సినిమాలో కథ ప్రకారం బాలయ్య రెండు పాత్రల్లో కనిపిస్తాడట. అందులో ఓ పాత్రను చిన్నప్పటి నుండి కాశీలో అఘోరాలు పెంచి పెద్ద చేస్తారట. అలా పెరిగిన‌ బాలయ్య వాళ్లలాగే తయారవుతాడని టాక్. ఇప్పటికే సర్వత్రా అసక్తిని రేకెత్తిస్తున్న ఈ సినిమాను దసరా బరిలో నిలిపేందుకు బోయపాటి సన్నాహాలు చేస్తున్నాడు. మరి అఘోర గెటప్ తో బాలయ్య ఏ రేంజ్ సంచలనం రేపుతాడో చూడాలి.