వయసు 70.. అయితేనేం బాక్సాఫీస్‌ని చెడుగుడు ఆడేస్తున్నాడు. ఆయనే తలైవా సూపర్‌స్టార్ రజనీకాంత్. ఏడు పదుల వయసులో వెండితెరపై మెరుపులు మెరిపిస్తున్నారు. రజనీ నటించిన తాజా చిత్రం `దర్బార్`. ఎ.ఆర్. మురుగదాస్ డైరెక్షన్‌లో లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమాపై అసలు ఎవరికీ హోప్స్ లేవు. ఎందుకంటే మురుగదాస్ స్పైడర్‌తో భారీ ఫ్లాప్‌ని సొంతం చేసుకున్నా ఆ తరువాత చేసిన `సర్కార్` మిశ్రమ ఫలితాన్నే అందించింది. దీంతో రిలీజ్ బిఫోర్ `దర్బార్`పై ట్రేడ్ వర్గాల్లో, ఇటు ప్రేక్షకుల్లో అసలు బజ్ లేదు.
దీంతో తలైవా చిత్రానిక ఇలాంటి పరిస్థితా అని వరుస కథనాలు వినిపించాయి. అయితే రిలీజ్ తరువాత సీన్ మారింది. థియేటర్లలో ఒక్కసారిగా రజనీ స్పార్క్ మొదలైంది. సినిమాలో రజనీ 45 ఏళ్ల యువకుడిగా పరుగులు పెట్టించారు. తలైవాని ఈ రేంజ్‌లో తెరపై చూడాలని ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన ఫ్యాన్స్ `దర్బార్` దెబ్బతో పండగ చేసుకుంటున్నారు. అందుకు తగ్గట్టే సినిమా కలెక్షన్స్ ట్రేడ్ వర్గాలనే విస్మయపరుస్తున్నాయి. వరల్డ్ వైడ్‌గా తొలి రోజే 50 కోట్లు వసూలు చేసిన `దర్బార్` రెండవ రోజు కూడా హవాని కొనసాగించడంతో తొలి రోజుకు మించి మౌత్ టాక్ స్పెడ్ కావడంతో 100 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది.
ప్రస్తుతం పొంగల్ సీజన్ కావడంతో రజనీ హవా మరింతగా వుండే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని, దీని వల్ల కలెక్షన్‌లు కూడా భారీగానే పెరుగుతాయని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు.