బన్నీ వాసూ …నీ వివరణలో క్లారిటీ మిస్సైంది బాసూ

బన్నీ వాసూ…ఈ రచ్చ ఏంటి..ఈ వివరణ ఏంటి

మెగా క్యాంప్ నిర్మాత బన్నీ వాసుపై జూనియర్ ఆర్టిస్ట్ సునీత రీసెంట్ గా కొన్ని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇంతకుముందు ఆమె కత్తి మహేష్ తో సహా ఇతరులపై చేసిన నిరాధార ఆరోపణల కారణంగా ఆమె ఇష్యూని మెయిన్ స్ట్రీమ్ అంతగా సీరియస్ పట్టించుకోలేదు. కానీ సోషల్ మీడియా, వెబ్ మీడియా మాత్రం పూర్తిగా కవర్ చేసింది.

ఆ విషయం ప్రక్కన పెడితే… ఈ రోజు గీతా అర్త్స్ సంస్థ సోషల్ మీడియా హేండిల్ ద్వారా బన్ని వాసు ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. అదేమిటంటే … ఓ జూనియర్ ఆర్టిస్ట్ తనకి వాళ్ళ సినిమాల్లో ఒక పాత్ర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆఫీస్ గేట్ వద్ద గతంలో హల్చల్ చేసిందట. ఈ మేటర్ లో ఇప్పటికే పోలీసులకి ఫిర్యాదు చేశారట. గతంలోనూ ఇలాగే జరిగిందిట. ఈ విషయంలో ఎవరికైనా డౌట్స్ ఉంటే వాళ్ళు పీ.ఆర్ టీంని సంప్రతించాలని అన్నారు.

ఈ వివరణ బాగానే ఉంది కానీ ఆ జూనియర్ ఆర్టిస్ట్ …కేవలం ఒక్క గీత ఆర్ట్స్ ఆఫీస్ వద్దే ఎందుకు రచ్చ చేస్తోంది? హైదరాబాద్ లో ఎన్నో ప్రొడక్షన్ హౌసులు ఉండగా ..ఎందరో నిర్మాతలు ఉండగా ఒక్క బన్నీ వాసుపైనే ఆమె ఎందుకు ఒత్తిడి చేస్తోంది? దీనికి రిప్లై లేదు. అలాగే ఇంకా వివరణ కావాలంటే వాళ్ళ పీఆర్వోలని అడగాలనటం కూడా మీడియా వర్గాల్లో చర్చగా మారింది.

కాగా బన్నీ వాసు ప్రస్తుతం అఖిల్‌ అక్కినేని నటిస్తున్న ఓ సినిమా షూటింగ్‌ పనుల్లో బిజీగా ఉన్నారు.