`సోగ్గాడే చిన్నినాయనా` నాగ్ కెరీర్‌లో ఓ స్పెషల్ మూవీ. 2016 సంక్రాంతి బరిలో నిలిచిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించి నాగార్జున కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రంగా నిలిచింది. నాగ్‌ని 50 కోట్ల క్లబ్‌లో చేర్చింది. అందుకే నాగ్ కు ఈ సినిమా అంటే వెరీ వెరీ స్పెషల్. అందుకే ఈ సినిమాకు ఖచ్చితంగా సీక్వెల్ చేస్తానని, దానికి `బంగార్రాజు` అనే టైటిల్ ఫిక్స్ చేశామని కొన్నేళ్ల క్రితమే స్టేట్‌మెంట్ ఇచ్చేశారు నాగార్జున.
2019 ప్రధమార్థంలో ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకురావాలని, 2020 సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ మల్టీపుల్ రీజన్స్ కారణంగా, స్క్రిప్ట్‌లో మేజర్ మార్పులు, అదే సమయంలో దర్శకుడు కల్యాణ్‌కృష్ణ ఫ్యామిలీ మెంబర్ చనిపోవడం వంటి కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ డిలే అవుతూ వచ్చింది. తాజాగా స్క్రిప్ట్‌లో మేజర్ మార్పులు పూర్తయి స్క్రిప్ట్‌ని పక్కాగా లాక్ చేసేశారు. ఇక రెడీ టూ షూట్.
ఫైనల్‌గా ఈ చిత్రాన్ని మార్చి 25 ఉగాది రోజులన లాంఛనంగా ప్రారంభించాలని డేట్, ముహూర్తం ఫిక్స్ చేసేశారు. త్వరలోనే దీనికి సంబంధించిన న్యూస్‌ని మీడియాకు వదలబోతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లోనే ఈ చిత్రాన్ని కూడా నిర్మించడానికి నాగార్జున సర్వం సిద్ధం చేశారు. సినిమాలో నాగ్‌తో పాటు నాగచైతన్య కూడా కనిపించబోతున్నాడు. చై ప్రస్తుతం శేఖర్ కమ్ముల `లవ్‌స్టోరీ`లో నటిస్తున్నాడు. షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరో పక్క నాగ్ `వైల్డ్ డాగ్`లో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు వచ్చే నెల వరకు ఓ కొలిక్కి వస్తాయి. దీంతో తండ్రీ కొడుకులు `బంగార్రాజు`కి డేట్స్ కేటాయిస్తారట.