ఫొటోస్టోరీ: పిక్కుల‌తో పిచ్చెక్కిస్తోంది!

సినిమాల కంటే జ‌నాల‌కి ద‌గ్గ‌రియ్యే దారులు సెల‌బ్రిటీస్‌కి ఈ మ‌ధ్య ఎక్కువ‌య్యాయి. సినిమాల్లో కీ రోల్ అని ద‌ర్శ‌కుడు చెప్పినా తెర‌పై ఆ పాత్ర ఎంత స‌మ‌యం మెరుస్తుందో లేక ఎడిటింగ్‌లో షార్ట్ అయిపోతుందో అన్న‌ది ఎవ‌రికీ క్లారిటీ లేదు. దీంతో సోష‌ల్ మీడియాలోనే త‌మ టాలెంట్‌ని ఆడియ‌న్స్‌ని చూపించి పిచ్చెక్కించేస్తున్నారు సెక్సీ హీరోయిన్స్‌. హాట్ హాట్ ఫొటోల‌లో సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్‌తో పాటు ఇన్‌స్టాని నింపేస్తూ యూత్‌కి పూన‌కాలు తెప్పించేస్తున్నారు.

ఈ జిబితాలో బాలీవుడ్ హాట్ దిషా ప‌టానీ ముందు వ‌రుస‌లో నిలిస్తే ఆ త‌రువాత‌ స్థానంలో మ‌ల‌యాళీ కుట్టి మాళ‌వికా మోహ‌న‌న్ నిలుస్తోంది. చేసింది త‌క్కువ సినిమాలే.. మెయిన్ హీరోయిన్ క్యారెక్టలు కూడా కాదు. కానీ ఇన్‌స్టాలో మాత్రం మెయిన్ హీరోయిన్స్‌ని డామినేట్ చేస్తూ హాట్ షో సేస్తోంది. తాజాగా పింక్ డ్రెస్‌లో ఎద అందాల‌ని చూపిస్తూ మాళ‌వికా మోహ‌న‌న్ చేసిన హాట్ ట్రీట్ నెటిజ‌న్స్‌ని, సోష‌ల్ మీడియా ల‌వ‌ర్స్‌ని హీటెక్కించేస్తోంది.

సినిమాల‌ని మించి గ్లామ‌ర్ షోతో పాపుల‌ర్ అవుతున్న మాళ‌విక ప్ర‌స్తుతం త‌మిళంలో విజ‌య్ హీరోగా `ఖైదీ` ఫేమ్ లోకేష్ క‌న‌క‌రాజ్ డైరెక్ట్ చేస్తున్న `మాస్ట‌ర్‌` చిత్రంలో న‌టిస్తోంది. తెలుగులో మాళ‌విక అంగీక‌రించిన `హీరో` ఇప్ప‌టికీ సెట్స్‌పైకి రాలేదు. విజ‌య్ దేవ‌ర‌కొండ ఇందులో హీరో. పూరి సినిమాతో పాటు ఈ చిత్రాన్ని కూడా ఒకేసారి పూర్తి చేయాల‌ని భావిస్తున్నాడు.