ప‌వ‌ర్ స్టార్ బ‌ర్త్ డే .. 15రోజుల ముందే సంద‌డి!

Pawan Kalyan

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సెప్టెంబర్ 2. డేట్ లాక్ అయ్యింది కాబ‌ట్టి ఇక ఇప్ప‌టికే అభిమానుల్లో సంబ‌రాలు మిన్నంటాయి. ఇంకో 16రోజులు ఉండ‌గానే సినీ అభిమానులు జ‌న సైనికులు సంబ‌రాలు మొద‌లెట్టేశారు. ఎంతో అడ్వాన్స్ డ్ గా హ్యాపీ బ‌ర్త్ డే ప‌వ‌ర్ స్టార్ అన్న ట్యాగ్ తో సామాజిక మాధ్య‌మాల్లో ట్రెండింగ్ చేస్తున్నారు.

సౌతిండియాలోనే భారీ ఫాలోయింగ్ ఉన్న టాప్ 5 స్టార్ల‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒక‌రు. న‌టుడిగా రాజ‌కీయ నాయ‌కుడిగా అత‌డి  కి ఫాలోయింగ్ ఉంది. ఇక జన‌సేనానిగా ప్ర‌జ‌ల్లోకి వెళ్లినా ప్ర‌స్తుత మ‌హ‌మ్మారీ సందిగ్ధ కాలంలో సైలెన్స్ ని మెయింటెయిన్ చేస్తున్నారు. పైగా వ‌రుస‌గా సినిమాల‌కు సంత‌కాలు చేసి ప‌వ‌న్ బిజీ అయిపోవ‌డంతో రాజ‌కీయంగా హ‌డావుడి ఏదీ లేదు.

ప‌వ‌న్ న‌టించిన వ‌కీల్ సాబ్ 20 రోజుల చిత్రీక‌ర‌ణ పెండింగులో ఉండ‌గా.. మ‌రోవైపు క్రిష్ సినిమా.. హ‌రీష్ సినిమాల‌పైనా ప‌వ‌న్ దృష్టి సారించారు. క‌రోనా లాక్ డౌన్లు ఏవీ లేక‌పోతే షూటింగుల‌కు వెళ్లాల‌ని ప‌వ‌న్ భావిస్తున్నారు. అయితే 2020లో సెట్స్ కెళ్లే వీలు లేక‌పోవ‌డంతో వ‌చ్చే సంవ‌త్సరంపైనే ఆశ‌ల‌న్నీ ఉన్నాయ‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రి ప‌వ‌న్ ఏం చేస్తారో చూడాలి. ఇక ప‌వ‌ర్ స్టార్ పేరుతో ఆర్జీవీ చేస్తున్న సంద‌డి తెలిసిందే. ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజున ఈ సినిమా ట్రైల‌ర్ ని రిలీజ్ చేస్తామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. అది జ‌రుగుతుందా లేదా? అన్న‌ది చూడాలి.

https://twitter.com/timmanolla/status/1282727252401065984