అనుష్క , ప్రభాస్ పెళ్లి ఇప్పుడు మళ్ళీ వార్తల్లో ప్రధానంగా వినిపిస్తుంది. ఈమధ్య కరణ్ జోహార్ నిర్వహించిన ఓ షో లో రాజమౌళితో పాటు ప్రభాస్ కూడా పాల్గొన్నాడు. ఈ షో లో కరణ్ ప్రభాస్ ను అనుష్కతో డేటింగ్ విషయం ప్రస్తావించాడు . అయితే దీనికి లేదు అన్నా , అతని కళ్ళలో వెలిగిన నవ్వే చెబుతోంది అద్దరి మధ్య ఎదో ఉందని. అయితే చివరిలో మళ్ళీ కరణ్ నువ్వు అబద్దమ్ చెప్పావు కదా అని అడిగాడు .
ఆ మాటకు సమాధానం చెప్పకుండా ఓ చిరు నవ్వు విసిరాడు . మరి ఇది అర్ధగీకారమే కదా ! ప్రభాస్ తో అనుష్క “మిర్చీ “, “బిల్లా “, “బాహుబలి ” రెండు భాగాలు . అంతకు ముందు రెండు చిత్రాల్లో నటించినా బాహుబాలి సమయంలో ఎక్కువ సంవత్సరాలు కలసి నటించడం వల్ల ఇద్దరి మధ్యలో ప్రేమ మొదలైందని , అది డేటింగ్ వరకు వెళ్లిందని తెలుస్తుంది . నిజానికి అంతకు ముందు అనుష్కతో ఓ పారిశ్రామిక వేత్త, మరో నిర్మాత పేర్లు వినిపించాయి .
అయితే బాహుబలి తరువాత ఒక్క ప్రభాస్ పేరే వినిపిస్తుంది . అనుష్క , ప్రభాస్ వివాహం పోస్ట్ ఫోన్ కావడానికి ప్రభాస్ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవడం లేదని అంటున్నారు . అయితే ప్రభాస్ మాత్రం అనుష్కనే పెళ్లి చేసుకుంటానని చెబుతున్నాడట . అందుకే వివాహం వాయిదా పడుతూ వస్తోంది .
ఇక అనుష్క ఇంటిలో కూడా ప్రభాస్ నే వివాహం చేసుకుంటానని స్పష్టం చేసిందట. ఈ సంవత్సరం జనవరి 26న అనుష్క నటించిన “భాగమతి ” సినిమా విడుదలైంది . ఆ తరువాత సినీమామాలు ఒప్పుకోకుండా విదేశాలకు వెళ్ళిపోయింది. సినిమాల కోసం అనుష్క బరువు పెరిగింది . ఆ బరువు తగ్గించుకోవడాని ,స్లిమ్ గా తయారు కావడానికి వెళ్లిందని ఆమె సన్నిహితులు చెప్పారు .
ప్రస్తుతం అనుష్క “ఎన్టీఆర్ బయోపిక్ ” చిత్రంలో బి . సరోజాదేవి పాత్రలో నటిస్తుంది . వేరే సినిమాలు ఏవీ అనుష్క ఒప్పుకోలేదు . పెళ్లికోసమేనని అంటున్నారు .
కొత్త సంవత్సరం లో ప్రభాస్ , అనుష్క పెళ్లి వార్త అధికారికంగా ప్రకటిస్తారేమో చూడాలి .