సమంతకు గోవా అంటే చాలా ఇష్టం. ఏ అకేషన్ అయినా గోవాకి వెళ్లి చేసుకోవాల్సిందే. బర్త్‌డే అయినా, పెళ్లి రోజు అయినా అంతగా గోవా లోనే. ఇటీవల చైతూ బర్త్‌డేని, పెళ్లి రోజుని, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ని అక్కడే చేసుకున్నారు. తాజాగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ని చైతూ, సామ్ కలిసి గోవాలోనే సెలబ్రేట్ చేసుకున్నారు. అక్కినేని నాగచైతన్య, సమంతలు ఏడేళ్ల ప్రేమాయణం తరువాత ఇరుకుటుంబాల అంగీకారంతో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరి వివాహం గోవాలోనే జరిగింది.
గోవా అంటే ప్రత్యేక ఇష్టాన్ని ప్రదర్శించే సమంత సినిమాల నుంచి రిటైర్‌మెంట్ తీసుకున్నాక తనకు ఇష్టమైన ప్లేస్ గోవాలోనే వుండాలనుకుంటోందట. ఇందు కోసం ప్రత్యేకంగా ఓ ప్లేస్‌ని కూడా కొనుగోలు చేసిందట. అక్కడే ఓ సూపర్ విల్లాని సీ వ్యూతో ఐశ్వర్యారాయ్, షారుఖ్‌ల తరహాలో నిర్మించుకోవాలని ప్లాన్ చేస్తోందట. సామ్ ప్రస్తుతం `96` ఆధారంగా రూపొందుతున్న `జాన్` చిత్రంతో పాటు హిందీ వెబ్‌సిరీస్ `ఫ్యామిలీ మ్యాన్ 2`లో నటిస్తోంది.