కొన్నేళ్ల ముందే తెలుగు తెర కు పరిచయం అయిన పూజ హెగ్డే హిట్ అందుకున్నది మాత్రం ఈ మధ్యనే. దాంతో వరుస పెట్టి అవకాశాలు క్యూ కట్టాయి. దానికి తోడు గ్లామర్ షో కూడా అడ్డు చెప్పకపోవడం కూడా కారణమే. అందువల్ల ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపొయింది.
కోట్లల్లో రెమ్యూనరేషన్, చేతి నిండా పెద్ద హీరోల సినిమాలు. దాంతో ఆమెకు తల పొగరు ఎక్కువైందని. దర్శకనిర్మాతలను చాలా ఇబ్బంది పెడుతుందని, షూటింగ్ ఆమె వల్ల ఆలస్యమవుతుందని వాపోతున్నారు దర్శకనిర్మాతలు.
స్టార్డమ్ ఎంత త్వరగా వచ్చిందో అలాగే పోతుంది కానీ క్రమశిక్షణతో మెలిగిన వారికే ఇక్కడ మనుగడ అనే సూత్రం ఈ అందాల భామ తెలుసుకునేసరికి ఎంత కాలం పడుతుందో. ఆమె లాగే ఇది వరకు బడాయి పోయిన పెద్ద హీరోయిన్లు ఇప్పుడు అవకాశాలు లేక గోళ్లు గిల్లుకుంటున్నారు అని ఆమె గ్రహిస్తే బావుంటుంది.