‘పుష్ప’  కోసం  బాలీవుడ్ టాప్ హీరోయిన్ ?

Allu Arjun in Pushpa
 
అల్లు అర్జున్ కి పాన్ ఇండియా స్టార్ అనిపించుకోవాలని బాగా కోరికగా ఉందనేది వాస్తవం. సుకుమార్  కలయికలో  రానున్న  ‘పుష్ప’ సినిమాలో  ఎలాగైనా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ను ఓ స్పెషల్‌ సాంగ్‌ కోసం ఒప్పించాలని మేకర్స్ కూడా ప్రయత్నాలు చేస్తున్నారట. మరి ఏ స్టార్ హీరోయిన్ బన్నీతో స్టెప్స్ వేయడానికి ఒప్పుకుంటుందో చూడాలి. స్టార్ హీరోయిన్ ఒప్పుకోకపోతే అప్షన్ గా బాలీవుడ్‌ బ్యూటీ  ఊర్వశి రౌటెలాను తీసుకోవాలనుకుంటున్నారు. మరి బన్నీకి స్టార్ హీరోయిన్ దొరుకుతుందో లేక ఊర్వశితోనే ఎడ్జెస్ట్ అవ్వాలో  తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా నుండి విజయ్ సేతుపతి తప్పుకునట్లు  గత కొన్ని రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం విజయ్ సేతుపతి విషయం ఇంకా ఫైనల్ అవ్వలేదట.
 
విజయ్ తప్పుకుంటే… అతని ప్లేస్ లో మాధవన్ ను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక ఈ చిత్రంలో బన్నీకి జోడీగా వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. ఆమె గిరిజన యువతిగా కనిపించనుంది.స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్న ఈ సినిమాలో  బన్నీ దొంగగా అలాగే పోలీస్‌ ఆఫీసర్‌ గా కూడా నటిస్తున్నాడు. మొత్తానికి అన్ని ఇండస్ట్రీస్ నుండి స్టార్ లను తీసుకుని  ఈ సినిమా రేంజ్ ను పెంచాలకుంటున్నారు.  పైగా  ‘రంగస్థలం’ సినిమాతో సూపర్ హిట్ కొట్టి టాప్ డైరెక్టర్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న సుకుమార్ నుండి ఈ పుష్ప సినిమా వస్తుండటంతో  ఈ చిత్రం పై భారీ అంచనాలున్నాయి.