స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం `పుష్ప`. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయాలని పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేశారు. ఈ ప్లాన్‌ని కరోనా తలకిందులు చేస్తోంది. కరోనా క్రైసిస్ టాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. భారీ సినిమా అంటే ఆ హంగామా వేరు. చిన్న ప్రాపర్టీ విషయంలో కూడా కాంప్రమైజ్ అయ్యే వారు కాదు. కానీ ఇప్పడు సీన్ మారింది.
ఎంత పెద్ద సినిమా అయినా సరే కాస్ట్ కటింగ్ పాటించాల్సిందే అంటూ చర్చ మొదలైంది. ఆ చర్చ `పుష్ప` సినిమాకు ఇబ్బందికరంగా మారుతోంది. శేషాచలం అడవుల్లో గంధపు చక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఊర మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. అయితే ఈ చిత్రం కోసం భారీ యాక్షన్ సన్నివేశాల్ని డిజైన్ చేశారట. ఈ సీక్వెన్స్ కోసం ఇంటర్నేషనల్ ఫైట్ మాస్టర్స్‌ని తీసుకురావాలని ప్లాన్ చేశారట సుక్కు.
అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇంటర్నేషనల్ ఫైట్ మాస్టర్స్‌ని తీసుకొచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. బడ్జెట్ కటింగ్, వీసా సమస్యల నేపథ్యంలో తమ నిర్ణయాన్ని మార్చుకున్నారట. యాక్షన్ సీన్‌ల కోసం లోకల్ ఫైట్ మాస్టర్లనే వాడాలని, తక్కువ ఖర్చులోనే బెస్ట్ అవుట్ పుట్‌ని రాబట్టాలని సుకుమార్‌తో పాటు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట.