పుష్పలో విల్లన్ గా సునీల్ శెట్టి? కీలక పాత్రలో కన్నడ హీరో!

అల్లు అర్జున్ పాన్ ఇండియా ఫిల్మ్ `పుష్ప‌`

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న చిత్రం `పుష్ప‌`. సుకుమార్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా ‌స్థాయిలో ప‌ల్ఆన్ చేస్తున్నారు. మైత్రీ మూవీమేక‌ర్స్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ‌, హిందీ, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ర‌ష్మిక మంద‌న్న క‌థానాయిక‌గా న‌టిస్తోంది.

గ‌త కొన్నేళ్ల క్రితం చిత్తూరు స‌మీపంలో ఓ సంఘ‌ట‌న జ‌రిగింది. గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్లింగ్ కోసం చెన్నై నుంచి వ‌చ్చిన వ‌ల‌స కూలీలు శ‌వాలుగా మారారు. దీన్ని బేస్ చేసుకుని సుకుమార్ ఈ చిత్ర క‌థని సిద్ధం చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. శేషాచ‌లం అడ‌వుల్లో గంధ‌పు చ‌క్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

సినిమా పాన్ ఇండియా స్థాయిలో వుండాలంటే ద‌క్షిణాదిలో పాటు హిందీ న‌టులు కూడా వుండాల‌ని భావించిన సుకుమార్ తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ న‌టుల్ని ఈ చిత్రంలోని కీల‌క పాత్ర‌ల కోసం తీసుకుంటున్నార‌ట‌. ఇప్ప‌టికే త‌మిళ నుడు విజ‌య్ సేతుప‌తిని ఓ కీ రోల్ కోసం తీసుకున్న సుకుమార్ విల‌న్ పాత్ర కోసం సునీల్ శెట్టిని ట్రైచేస్తున్నార‌ట‌. తాజాగా క‌న్న‌డ న‌టుడు ధ‌నంజ‌య‌ని ఓ స్పెష‌ల్ రోల్ కోసం తీసుకున్న‌ట్టు తెలిసింది. రామ్‌గోపాల్‌వ‌ర్మ నిర్మించిన `భైర‌వ‌గీత‌` చిత్రం ద్వారా ధ‌నంజ‌య తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మ‌య్యాడు.