చాలా మంది పిల్లలు దేవుడితో సమానం అంటారు. ఎదిగే కొద్దీ వారి మీద పరిసరాల ప్రభావం పడుతుంది. వాటిల్లో మంచి ఏదో చెడు ఏదో మనమే వారికి చెప్పాలి. పిల్లలు అవి తెలుసుకోవాలంటే తల్లిదండ్రులు వారి పెంపకం మీద, ఉపాధ్యాయులు, వారి బోధన మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. వయసుతో పాటు పిల్లల ఆలోచనలు, ఆశయాలు, వ్యక్తిత్వం ఎదగాలి. అలా జరగాలి అంటే పిల్లలను తల్లిదండ్రులు ప్రశ్నించనివ్వాలి. ప్రతి ప్రశ్నకు మనం విసుక్కోకుండా సమాధానాలు ఇవ్వాలి. ఎప్పటికప్పుడు పిల్లలకు ఉండే ప్రతి చిన్న అనుమానాన్ని తొలగించాలి. ప్రస్తుతం ఉన్న ఉరుకుల పరుగుల జీవితంలో ఇలా చేయడం ఎంతమంది తల్లిదండ్రులకు సాధ్యమవుతుందో ఒకసారి ఆలోచించుకోండి.
ఇదే ఆలోచన నా బిడ్డ లక్ష్మిప్రసన్నకి వచ్చి, తన బిడ్డ విద్యానిర్వాణ మరియు “చాయ్ బిస్కెట్” సంస్థతో కలిసి “చిట్టి చిలకమ్మ” పేరుతో ఒక youtube channel ప్రారంభిస్తున్నానని, పిల్లల పెంపకంలో ఉండే ఒక్కో సమస్యకు ఒక్కో episode చేస్తూ, పిల్లలకు వారి తల్లిదండ్రులకు ఉపయోగపడేలా ఆ short videos ఉంటాయని ఇటీవలె చెప్పుకొచ్చింది. అలాగే తన తండ్రి నుంచి ఆమె పొందిన ప్రేమ అనురాగం గురించి కూడా కొన్ని ఎపిసోడ్స్‌లాగా ప్రసారం చేస్తానని చెప్పారు. ప్రాధమిక జీవిత నైపుణ్యాలతో, తల్లిదండ్రులకు ఉపయుక్తమయ్యే చిట్కాలతో ప్రతీ శనివారం 6 PM కి ప్రసారమయ్యే ఈ Short Videos లో ప్రతీ వారం ఒక పిల్లల మానసిక వైద్యురాలు కూడా పాల్గొంటున్నారు.
ఇవి ఆహ్లాదకరంగా, ఆమోదయోగ్యంగా, ఉపయోగపడేలా ఉండాలని, లక్ష్మిప్రసన్న ఎంతో ఇంట్రస్టింగ్‌గా ఈ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తున్నారు. ఇక మరి ఆల్రెడీ లక్ష్మీ మంచు ఇప్పటికే చాలా టీవీషోస్ చేస్తూ మంచి పాపులర్ అయిన విషయం తెలిసందే. ఆమె ఒక్కోసారి ఒక్కోషో తో ప్రేక్షకులను ఆకర్షిస్తూ ఉంటారు. మరి ఈ సారి ఆమె చేసే ఈ యూట్యూబ్ ఛానల్ ప్రయత్నం ఎంత వరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి.