పింక్ రీమేక్ లో బాలయ్య

హిందీ లో హిట్ అయిన ‘పింక్’ చిత్రం గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో లాయర్ పాత్రలో అమితాబ్ నటించి మెప్పించారు. ఆ సినిమాను తమిళంలో కూడా రీమేక్ చేయగా అమితాబ్ పాత్రలో అజిత్ నటించారు. ఆ సినిమాను ఇప్పుడే తెలుగులో రీమేక్ చేయాలనుకుంటున్నారు. అమితాబ్ పాత్రలో బాలయ్య నటించే అవకాశం ఉంది.
ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది. ఎందుకంటే, అసలు ఈ సినిమాను తెలుగులో చేయడం లేదని అందులోనూ బాలయ్య నటించడం అంతా వట్టిదే అని సినీ పండితులు అంటున్నారు.