పాయల్ రాజపుత్ మరోసారి అందర్నీ కట్టిపడేస్తోందా?

టాలీవుడ్ లో అడుగు పెడుతూనే కుర్రకారును తన వైపునకు తిప్పుకుంది క్రేజీ గర్ల్ పాయల్ రాజపుత్. ఈ భామకు ‘ ఆర్ ఎక్స్ -100’ చిత్రం తెచ్చిన ఇమేజ్ అంతా ఇంతా కాదు! తొలి సినిమాతోనే ఇండస్ట్రీలో హాట్ హాట్ గా మారిపోయింది. క్రేజీ హీరోల కళ్ళల్లో కూడా పడింది. వరుస అవకాశాలు తలుపుతట్టాయి.

తాజాగా భారతీయ తొలి ఫైటర్ పైలెట్ పాత్రలో కనిపించబోతోందిప్పుడు. సీనియర్ దర్శకుడు జయంత్ సి . పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నరేంద్ర’ చిత్రం లో ఈ పాత్రను పోషిస్తోంది. అమాయకుడైన ఒక భారతీయ బాక్సర్ పాకిస్థాన్ జైలు లో ఎలా బందీ అయ్యాడు? అక్కడినుంచి ఎలా తప్పించుకున్నాడు? అనే థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న చిత్రమిది.కథానాయకుడు నీలేష్ ఈ చిత్రంలో బాక్సర్ గా కనిపిస్తాడు. మానవ హక్కుల కార్యకర్త పాత్రలో ఇసాబెల్లె నటిస్తోంది. క్రేజీ గర్ల్ పాయల్ రాజపుత్ పాత్ర అందర్నీ మరోసారి కట్టిపడేయడం ఖాయం అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి!?