మెగా కుటంబం వదిలేసారా అల్లుడుని
మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు, శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ ప్రధాన పాత్రలో ఆ మధ్యన విజేత అనే సినిమా వచ్చింది. అది డిజాస్టర్ అయ్యింది. అయితే ఆ సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. అదే వేరే మెగా హీరో అయితే ఈ గ్యాప్ లో ఇంకో సినిమా రిలీజ్ కు రెడీ చేసేసారు. కానీ కళ్యాణ్ దేవ్ కు ఆ సిట్యువేషన్ లేదు. మామ గారైన చిరంజీవి తన సైరా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.
మిగతా మెగా క్యాంప్ ఎవరికీ కళ్యాణ్ దేవ్ ని కేవలం ఇంటి అల్లుడుగానే కాని అంతకు మించి అతని కెరీర్ కు ఎవరూ ప్రోత్సాహం ఇవ్వలేదు. విజేత రిలీజ్ అయ్యినప్పుడు చివరకు చిన్న ట్వీట్ కూడా అతను సక్సెస్ అవ్వాలని ఎవరూ చెయ్యలేదు. ఇక మీడియా ముందుకు వచ్చి అయితే ఆ సినిమా గురించి ఎవరూ మాట్లాడలేదు. దాంతో ఆ సినిమా వచ్చినంత వేగంగా వెళ్లిపోయింది. ఆ తర్వాత సినిమా రావటానికి టైమ్ పట్టింది. అయితే ఆ సినిమా పూర్తి కావటం లేదు.
నూతన దర్శకుడు పులి వాసు దర్శకత్వంలో ‘కళ్యాణ్ దేవ్’ గత ఏడాది తన రెండువ సినిమాని మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అయితే చిత్రబృందం ఇటీవలే ఇప్పటివరకు షూట్ చేసిన ఫుటేజ్ ను చూసి.. స్క్రిప్ట్ పై మరింత వర్క్ చేస్తే బాగుంటుందని భావించిన టీం.. షూటింగ్ కి విరామం ఇచ్చి.. స్క్రిప్ట్ పై మరియు డైలాగ్ లపై వర్క్ చేసిన సంగతి తెలిసిందే. అయితే స్క్రిప్ట్ వర్క్ చాల బాగా వచ్చిందని సినిమాలో కామెడీ చాల బాగుంటుందట. అయితే రీసెంట్ గా మళ్లీ షూటింగ్ మొదలుపెట్టిన చిత్రం టీమ్ .. ఈ సినిమాలో తన పార్ట్ కి సంబంధించిన పార్ట్ ను పూర్తి చేశారట.
ఇక ఈ చిత్రం రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ రెండో సినిమాతో అయినా మెగా క్యాంప్ కలిసి వస్తే ఓ హిట్ కొడతాడు. అప్పటిదాకా ఈ బాలారిష్టాలు టైప్ కష్టాలు తప్పవేమో.