పవన్ వాయిస్ తో ‘సైరా’ టీజర్ ప్రోమో వచ్చేసింది

  ‘సైరా’ టీజర్ లో పవన్ వాయిస్ ఇదిగో..ఇలా అదిరిపోతుంది

స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తీస్తున్న చిత్రం ‘సైరా’. మెగాస్టార్‌ చిరంజీవి టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న ఈ సినిమా టీజర్‌ను ఆగస్టు 20న విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ టీజర్ …పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ తో రానుంది. ఈ విషయం ఇప్పటికే రిలీజైన ఫొటోలు ద్వారా తెలిసింది. ఇప్పుడు డైరక్ట్ గా ఈ టీజర్ పై అంచనాలు పెంచేందుకు పవన్ వాయిస్ ఓవర్ కు టీజర్ ప్రోమో వదిలారు. ఈ టీజర్ చివరల్లో గూస్ బంప్స్ వచ్చేలా సైరా నరసింహా రెడ్డి అని చెప్పడం ప్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. ఆ టీజర్ మీరు ఇక్కడ చూడవచ్చు.

Pawan Kalyan Voice Over For Sye Raa Teaser - Promo - Chiranjeevi, Surender Reddy | Ram Charan

ఇక అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్‌, విజయ్‌ సేతుపతి, నయనతార, తమన్నా, అనుష్క, జగపతిబాబు, సుదీప్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్టోబరు 2న చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15న ఈ సినిమా మేకింగ్‌ వీడియోను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి సంగతి తెలిసిందే.