పవన్ పై ప్రేమ కవిత రాసిన హీరోయిన్
మొదటి నుంచీ నటి, బీజేపీ నేత మాధవీలత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని. శ్రీరెడ్డి వివాద సమయంలో ఆయనకు మద్దతుగా సైలెంట్ ప్రొటెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జనసేనలో కాకుండా బీజేపీలో చేరినప్పటికీ.. పవన్ కళ్యాణ్‌పై ఆమెకున్న అభిమానం ఏ మాత్రం తగ్గలేదు. తాజాగా పవన్ కళ్యాణ్‌కు రాసిన ప్రేమ కవితలను ఆమె ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. కానీ ఆ ప్రేమ కవిత ఇప్పటిది కాదు, 19 ఏళ్ల క్రితం నాటిది. 2000వ సంవత్సరం జూన్ 6న పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి తాను రాసుకున్న ప్రేమ కవితను మాధవీలత ఫేస్ బుక్‌లో పంచుకున్నారు.
ఆ ప్రేమ కవిత ఈ విధంగా సాగింది.
‘‘మనసులో ఏదో వేదన
కారణం తెలియక పడుతున్నా తపన
హృదయంలో అనురాగం అనే భావన
దానికో రూపం ఇచ్చేందుకే ఈ సాధన
నీవు కనిపించగానే నా హృదయంలో ఏదో బాధ
నా మనస్సుని ఎవరో గట్టిగా పట్టేసినట్టుగా వేదన
ఒక పక్క సంతోషం, మరోపక్క దుఃఖం కానీ,…. కానీ ఎందుకో తెలీదు
నిను చూస్తున్న ప్రతీక్షణం నేను కారణం చెప్పలేని భావాలలో విలవిల్లాడిపోతాను.
దానికి అర్థం ఏంటి? నేను ఎందుకిలా అవుతున్నాను?
ఇది ఆకర్షణా? ప్రేమ అనే వ్యామోహమా?
No. కానే కాదు. అటువంటిది కాదు. మరేంటి?…..?’’