న‌వ‌దీప్ కోసం సినిమాగా మారుస్తున్నారా?

న‌వ‌దీప్ సిల్క‌ర్ స్క్రీన్‌పై ఎన్ని సినిమాలు చేసినా పెద్ద‌గా గుర్తింపు రాలేదు. దీనికి తోడు అత‌న్ని హీరోగా పెట్టి సినిమాలు తీసేవాళ్లు కూడా క‌రువ‌య్యారు. ఎందుకంటే అత‌నితో సినిమా తీస్తే కొనే వాళ్లు లేరు. అంత‌గా అత‌ని మార్కెట్ ప‌డిపోయింది. దాంతో చిన్న చిన్న వేశాల‌కే ప‌రిమితం అయిపోయిడు. ఈ మ‌ధ్యే మ‌ళ్లీ `అల వైకుంఠ‌పురములో` చిత్రంలో చిన్న పాత్ర‌లో మెరిసాడు. వెబ్ సిరీస్‌ల‌తో మాత్రం త‌న స‌త్తా చాటుతున్నాడు.

ఇటీవ‌ల అల్లు అర‌వింద్ `ఆహా` పేరుతో డిజిట‌ల్‌ ఓటీటీని ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ఇందులో క్రిష్ నిర్మించిన `మ‌స్తీస్‌` మంచి టాక్‌ని తెచ్చుకుంది. ఇందులో న‌వ‌దీప్ న‌టించాడు. న‌వ‌దీప్‌, చాందినీల‌పై షూట్ చేసిన లిప్ లాక్ సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైర‌ల్ అయింది కూడా. దీనితో పాటు న‌వ‌దీప్ స‌న్నీలియోన్‌తోనూ ఓ వెబ్ సిరీస్ చేశాడు. తాజాగా `ఆహా` కోసం న‌వ‌దీప్‌, పూజిత పొన్నాడ జంట‌గా `ర‌న్‌` పేరుతో వెబ్ సిరీస్‌ని ప్లాన్ చేశారు. అయితే దాన్ని సినిమాగా మార్చాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. స్క్రిప్ట్ టేకింగ్ బాగుండ‌టంతో దాన్ని సినిమాగా మార్చి రిలీజ్ చేస్తే మ‌ళ్లీ న‌వ‌దీప్ కెరీర్ ఊపందుకునే అవ‌కాశం వుంద‌ని భావిస్తున్నారు.

ఈ చిత్రాన్ని క్రిష్ ఫాద‌ర్ జాగ‌ర్ల‌మూడి సాయిబాబా, స్నేహితుడు రాజీవ్‌రెడ్డి నిర్మిస్తార‌ట‌. ఈ చిత్రానికి ల‌క్ష్మీకాంత్ చెన్న ద‌ర్శ‌కత్వం వ‌హిస్తార‌ని తెలిసింది. అల్లు అర‌వింద్ అంచ‌నా ప్ర‌కారం `ర‌న్‌` న‌వ‌దీప్ కెరీర్‌ని మ‌లుపు తిప్పుతుందేమో చూడాలి.