నెట్‌ఫ్లిక్స్ ఆల్ట్ బాలాజీ‌తో ఇలియానా బిగ్ డీల్

గోవా బ్యూటీ ఇలియానా ప్ర‌ముఖ ఆన్ లైన్ స్ట్రీమింగ్ దిగ్గ‌జం నెట్ ఫ్లిక్స్, ఆల్ట్ బాలాజీ సంస్థ‌ల‌తో భారీ డీల్ కుదుర్చుకుంద‌ని తెలుస్తోంది. నెట్ ఫ్లిక్స్ నిర్మించే ఓ సిరీస్ లో తాను న‌టిస్తుంది. అలాగే ఆల్ట్ బాలాజీ సిరీస్ ని తాను స్వ‌యంగా జాయింట్ వెంచ‌ర్ లో నిర్మించ‌నుంద‌ని తెలిసింది. ఈ రెండూ భారీ డీల్స్ అని తెలిసింది. ఇక నెట్ ఫ్లిక్స్ తో డీల్ వ‌ల్ల దాదాపు 50 కోట్ల మేర ఇల్లీ బేబి లాభ‌ప‌డ‌నుంద‌ని ఓ గుస‌గుస వేడెక్కిస్తోంది.

ఇటీవ‌లి కాలంలో పెద్ద తెర‌పై ఏమంత ఆఫ‌ర్లు లేక‌పోయినా ఇలియానా స‌రైన జాక్ పాట్ కొట్టేసింది అంటూ బాలీవుడ్ ఇన్ సైడ్ గుస‌గుస వినిపిస్తోంది. ఇటు సౌత్ అటు నార్త్ రెండు చోట్లా ఇల్లి బేబికి చ‌క్క‌ని ఫాలోయింగ్ ఉంది. దీంతో ఆ రెండు సంస్థ‌లు ఇలియానాతో బిగ్ డీల్ కుదుర్చుకునేందుకు ఆసక్తిని క‌న‌బ‌రిచాయి.

తాజాగా ఈ రెండు డీల్స్ టోట‌ల్ విలువ వంద కోట్ల మేర ఉంటుంద‌ని ప్ర‌చారం సాగుతోంది. ఇక ఇలియానా ఇటీవ‌లి కాలంలో క్వారంటైన్ స‌మ‌యాన్ని జిమ్ – యోగా అంటూ ఇంట్లోనే గ‌డిపేస్తోంది. ప్ర‌స్తుతం బాడీని ఫిట్ గా తీర్చిదిద్దింద‌ని తెలుస్తోంది.

అలాగే ఇలియానా ప్ర‌స్తుతం అభిషేక్ బ‌చ్చ‌న్ స‌ర‌స‌న `బిగ్ బుల్` అనే చిత్రం‌లో న‌టిస్తోంది. ఈపాటికే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం లాక్ డౌన్ వ‌ల్ల వాయిదా ప‌డింది. అయితే డిస్నీ హాట్ స్టార్ లో ఈ మూవీని స్ట్రీమింగ్ చేయ‌నున్నారని తెలుస్తోంది. ఆ మేర‌కు ఇప్ప‌టికే అభిషేక్ బ‌చ్చ‌న్ త‌న ట్విట్ట‌ర్ లో వివ‌రాల్ని వెల్ల‌డించారు.