నారా రోహిత్ సినిమాలు చేయకపోవటం కారణం?

నారా రోహిత్ మళ్లీ స్క్రీన్ పై కనపడేది ఎప్పుడంటే…

నారా రోహిత్ 2009లో బాణం సినిమా చేసారు. ఇప్పటికి సినిమా కెరీర్ మొదలెట్టి పదేళ్ళు అయ్యింది. కెరీర్ మొదట నుంచీ కొత్త క‌థ‌ల్ని, కొత్త త‌ర‌హా ప్ర‌య‌త్నాల్నీ ప్రోత్స‌హించ‌డంలో ఎప్పుడూ ముందుండే హీరో నారా రోహిత్‌. రెగ్యులర్ కమర్షియల్ హీరో ల లాగ…ఒంటిచేత్తో కొడితే వంద మంది గాల్లోకి లేచి, పాతిక కిలోమీట‌ర్ల అవ‌త‌ల ప‌డే ఫార్ములా సినిమాల‌కు రోహిత్ మొదట నుంచీ వ్య‌తిరేకమే. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ప్ర‌య‌త్నం లో నిజాయ‌తీ క‌నిపించి అభిమానులను మరో సినిమా కోసం ఎదురుచూసేలా చేసింది.

అదే.. నారా రోహిత్‌కి ఓ స్పెషల్. ఓ స్టేజిలో సినిమా లు ప్లాఫ్ అయినా రోహిత్ నుంచి సినిమా వ‌స్తోందంటే…ఖచ్చితంగా అందులో విష‌యం ఉంటుంద‌న్న న‌మ్మ‌కానికి వ‌చ్చేసారు ప్రేక్ష‌కులు. అయితే అతను ఈ మధ్య కాలంలో ఎక్కడా వార్తల్లో కనపడటం లేదు. ముఖ్యంగా ఎలక్షన్స్ అయ్యాక మీడియాలో మాయమైపోయాడు. అందుకు కారణం ఏమిటనే చర్చ సినీ వర్గాల్లో మొదలైంది.

నారా రోహిత్ నటుడుగా ఎప్పుడూ నిరాశపరచకపోయినా తన లుక్ , బరువు పెరిగటం వంటి విషయాల్లో నిర్లక్ష్యం చూపాడు. హీరో అంటే మినిమం ఇలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే ఇండస్ట్రీ మనది కావటంతో రోహిత్ అవే ఇబ్బందులుగా మారాయి. దానికి తోడు తన పెద నాన్న అయిన చంద్రబాబు ఎలక్షన్స్ లో ఓడిపోయారు. దాంతో ఓ వర్గం నిర్మాతలు ఖచ్చితంగా రోహిత్ కు దూరం అయ్యారని వినికిడి.

లాభాలు రాకున్నా పాలక ప్రభుత్వంకు ,ముఖ్యమంత్రికి దగ్గరైన మనిషి అన్న అభిమానంతో, అవసరాలతో కొందరు నిర్మాతలు దగ్గరయ్యేవాళ్లు. అయితే ఇప్పుడు ఆ అవకాసం లేదు. నారా రోహిత్ 18 సినిమాలు ఇప్పటిదాకా చేస్తే వాటిల్లో ఎక్కువ డిజాస్టర్సే. అయితే సరైన కథ, దర్శకుడు పడితే మంచి స్దాయికి వెళ్లే హీరో అనేది మాత్రం అనేక సార్లు ప్రూవైన సత్యం. దాంతో ఆయన మళ్లీ సినిమాలు చేస్తాడని ఎదురుచూస్తున్నారు అభిమానులు. ప్రస్తుతం సరైన స్క్రిప్టు, తన లుక్ పై రోహిత్ దృష్టి పెట్టాడని వినికిడి.