నయనతార మనసు మార్చుకుందిట!?

తెలుగులో భక్తి చిత్రాల్లో అమ్మవారి పాత్రలంటే సీనియర్ నటి కేఆర్ విజయ, రమ్యకృష్ణే గుర్తుకొస్తారు. ఆ కోవలోకి మరో అగ్ర కథానాయిక కూడా చేరబోతోంది!? ‘మూకుత్తి అమ్మన్’ తమిళ చిత్రంలో నయనతార అమ్మవారి పాత్ర గెటప్‌లో కనిపించనుంది. ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్‌లుక్‌ను ఇటీవల చెన్నైలో విడుదల చేశారు. అమ్మవారి రూపంలో నయన్ నిండుగా కనిపిస్తోంది. ఆర్తె బాలాజీ, ఎన్‌జె శరవరణన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రాన్ని మేలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

నయన్ ప్రస్తుతం ఈ సినిమాతో పాటు నెట్రికన్, మరో సినిమాతో బిజీగా ఉంది. ఇక నయనతార దృష్టి మళ్లుతోందిట! ఇలాంటి పాత్రలపైనే మనసులగ్నం చేయనుందట! భక్తి చిత్రాల్లో నటించడానికి నయనతార మనసు మార్చుకుందిట!?