‘దేవదాస్’ రిలీజ్ డేట్ మారిందట

కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా ‘దేవదాస్’. ఈ సినిమాలో నాగ్ జోడీగా ‘మళ్ళీ రావా’ ఫేమ్ ఆకాంక్ష సింగ్ నటిస్తుండగా, రష్మిక మందన్నా నానితో జత కట్టింది. సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘భలే మంచి రోజు’, శమంతకమణి’ వంటి వినూత్న సినిమాలు అందించిన శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రాన్ని వినాయకచవితి సందర్భముగా సెప్టెంబర్ 12 న రిలీజ్ చేయాలి అనుకున్నారు. కానీ అప్పటికి సినిమా రెడీ అయ్యే అవకాశం లేకపోవటంతో రిలీజ్ డేటును పోస్టుపోన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. సెప్టెంబరు 27 న థియేటర్లకు రానుందని వెల్లడించారు చిత్ర బృందం. ఆ టైముకి ఈ సినిమాకి ఎటువంటి పోటీ కూడా ఉండకపోవచ్చు. సోలోగా ప్రేక్షకుల ముందుకు రానుంది ‘దేవదాస్’. ఈ మూవీలో నాగార్జున డాన్ పాత్రలో, నాని డాక్టరుగా కనిపించి ప్రేక్షకుల్ని అలరించనున్నారని తెలుస్తోంది.