దాన‌య్య కొడుక్కి ద‌ర్శ‌కుడు ఫిక్స్‌!

ఎన్టీఆర్, రామ్‌చ‌ర‌ణ్ క‌ల‌యిక‌లో నువ్వ‌ర్ బిఫోర్ ఎవ్వ‌ర్ ఆప్ట‌ర్ కాబినేష‌న్‌తో నిర్మాత డీవీవీ దాన‌య్య `ఆర్ ఆర్ ఆర్‌` చిత్రాన్ని నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. దాపు 350కోట్ల బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తోంది. చిత్రీక‌ర‌ణ స్టేజ్‌లోనే ప్రీరిలీజ్ స్టేజ్‌లోనే రికార్డులు సృష్టిస్తోంది.

ఇదిలా వుంటే ఈ చిత్ర నిర్మాత డీవీవీ దాన‌య్య త‌న త‌న‌యుడు క‌ల్యాణ్ దాస‌రిని హీరోగా ప‌రిచ‌యం చేయాల‌ని చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. త‌న‌కు తెలిసిన క్రేజీ ద‌ర్శ‌కుల‌కు భారీ ఆఫ‌ర్‌లు కూడా ఇచ్చార‌ట‌. ఇందులో మారుతి పేరు కూడా వినిపించింది. అయితే ఏదీ ఇంత వ‌ర‌కు మెటీరియ‌లైజ్ కాలేదు. అయినా దాన‌య్య ప్ర‌య‌త్నాలు మాత్రం ఆప‌లేదు. తాజాగా క‌ల్యాణ్ దాస‌రిని శ్రీ‌వాస్ ద‌ర్శ‌కత్వంలో హీరోగా ప‌రిచ‌యం చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌.

కాన్సెప్ట్ బేస్డ్ క్రైమ్ కామెడీగా ఈ సినిమా వుండబోతోంద‌ని, ఈ నెల నుంచే అ చిత్రాన్ని హైద‌రాబాద్‌లో మొద‌లుపెడుతున్నార‌ని తెలిసింది. దాన‌య్య సొంత బ్యాన‌ర్‌లోనే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నార‌ట‌. దీనికి సంబంధించిన మ‌రిన్ని విశేషాల్ని నిర్మాత దాన‌య్య‌నే వెల్ల‌డించ‌నున్న‌ట్టు తెలుస్తోంది.