త‌లైవాని కాపీ కొట్ట‌డం అంత ఈజీకాదుగా!

త‌లైవార్ సూప‌ర్‌స్టార్ స్టైల్స్ కే కింగ్ అన్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం. అలాంటి ఆయ‌న‌నే కాపీ కొట్టాలంటే అది కుదిరే ప‌నేనా?. డిస్కంరీ ఛానెల్ కోసం `మ్యాన్ వ‌ర్సెస్ వైల్డ్‌` పేరుతో బేర్ గ్రిల్స్ ఓ షోని చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ షో కోసం త‌మిళ సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్‌పై బేర్ గ్రిల్స్ ఓ డాక్యుమెంట‌రీని చిత్రీక‌రించాడు. దీనికి సంబంధించిన ఎపిసోడ్ సోమ‌వారం రాత్రి 8 గంట‌ల‌కు ప్ర‌సాద‌మైంది. ర‌జ‌నీ స్పెట్స్ స్టైల్ అల్టిమేట్‌. దాన్ని బేర్ గ్రిల్స్ అనుక‌రించే ప్ర‌య‌త్నం చేశాడు.

దీన్ని ఎలా గైనా అనుక‌రించి చూపించాల‌ని బేర్ గ్రిల్స్ ప‌డిన తిప్ప‌లు న‌వ్వులు పూయిస్తోంది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ వీడియోలో బేర్ గ్రిల్స్ ప‌డుతున్న పాట్ల‌ని చూసిన నెటిజ‌న్స్ అంతా త‌లైవాని కాపీ కొట్ట‌డం అంతా ఈజీ కాద‌ని కామెంట్‌లు పెడుతున్నారు. సాహ‌సాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన వ్య‌క్తి బేర్ గ్రిల్స్‌. మ‌న దేశంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీలో ఇదే త‌ర‌హా సాహ‌స యాత్రని ప్లాన్ చేసి వార్త‌ల్లో నిలిచాడు. ర‌జ‌నీతో పాటు బేర్ గ్రిల్స్ బాలీవుడ్ హీరో అక్ష‌య్‌కుమార్‌తోనూ ఓ డాక్యుమెంట‌రీని చిత్రీక‌రించాడు.