త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ ఇంట్లో విషాదం

త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ ఇంట్లో విషాదం

ప్ర‌ముఖ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ మాతృమూర్తి కృష్ణ‌వేణి (94) సోమ‌వారం మృతి చెందారు. ఆమె గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ తండ్రి త‌మ్మారెడ్డి కృష్ణ‌మూర్తి నిర్మాత కూడా. ఆయ‌న ర‌వీంద్ర ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై ల‌క్షాధికారి, జ‌మీందారు, బంగారు గాజులు, ధ‌ర్మ‌ధాత‌, ద‌త్త‌పుత్రుడు, డాక్ట‌ర్ బాబు త‌దిత‌న చిత్రాలు నిర్మించారు.అందులో అత్య‌ధిక శాతం విజ‌యాల్ని సాధించాయి.

ఈ దంప‌తుల‌కు ఇద్ద‌రు కుమారులు. పెద్ద కుమారుడు లెనిన్ బాబు గ‌తంలో మ‌రిణించారు. చిన్నకుమారుడు త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌. ఆయ‌న నిర్మాత‌గా, ద‌ర్శ‌కుడిగా ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌కు, సినీ కార్మికుల‌కు సుప‌రిచిత‌మే. ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాలు నిర్మించారు. మొద‌టి నుంచి వీరిది వామ‌ప‌క్ష భావ‌జాలం వున్న కుటుంబం.

ఈ సంద‌ర్భంగా త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ త‌న త‌ల్లి మ‌ర‌ణ వార్త‌ని మీడియాకు వెల్ల‌డించారు. అనారోగ్యం కార‌ణంగా గ‌త రెండు నెల‌లుగా త‌న త‌ల్లి ఇబ్బందిప‌డుతున్నార‌ని తెలిపారు. త‌న మిత్రులు, శ్రేయోభిలాషులు చాలా మంది ఫోన్‌లు చేస్తున్నార‌ని, క‌రోనా ప్ర‌భావం కార‌ణంగా త‌న‌ని క‌ల‌వ‌డానికి ఇంటికి ఎవ‌రూ రావ‌ద్ద‌ని ఈ సంద‌ర్భంగా త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ విజ్ఞ‌ప్తి చేశారు.