త‌మిళ తంబీల కోసం త‌లైవా ఎమోష‌న‌ల్ వీడియో

త‌మిళ తంబీల కోసం త‌లైవా ఎమోష‌న‌ల్ వీడియో

క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న నేప‌థ్యంలో సినిమా స్టార్స్ ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించేందుకు వీడియోల్ని రూపొందించి సోష‌ల్ మీడియా వేదిక‌గా షేర్ చేస్తున్నారు. ఇప్ప‌టికే మెగాస్టార్ చిరంజీవి వ్య‌క్తి గ‌త శుభ్ర‌త పాటించాల‌ని, చేతుల్ని శుభ్రంగా క‌తుక్కోవాల‌ని సూచిస్తూ ఓ వీడియోని పోస్ట్ చేశారు.

ఇప్ప‌టికే ఆ వీడియో ప‌లు టీవీ ఛాన‌ల్లో టెలీకాస్ట్ అవుతోంది. తాజాగా త‌మిళ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ కూడా ఈ జాబితాలో చేరారు. ఇత‌ర దేశాల్లో వుంటున్న త‌మిళుల‌ని ఉద్దేశించి ఓ ఎమోష‌న‌ల్ వీడియోని ట్విట్ట‌ర్ వేదిక‌గా పోస్ట్ చేశారు.

ఇత‌ర దేశాల్లో వున్న త‌మిళులంతా ఆయా దేశాల్లోని ప్ర‌భుత్వాలు క‌రోనా క‌ట్ట‌డి కోసం తీసుకుంటున్న చ‌ర్య‌ల్ని పాటించాల‌ని, త ద్వారా క‌న్నా వారికి ఆనందాన్ని క‌లిగించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ర‌జ‌నీ పోస్ట్ చేసిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.