తేజ‌కు అలిమేలు మంగ దొరికేసింది!

బెల్లంకొండ శ్రీ‌నివాస్ హీరోగా న‌టించిన చిత్రం `సీత‌`. కాజ‌ల్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రానికి తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అయితే ఈ మూవీ తేజ కెరీర్‌లోనే డిజాస్ట‌ర్‌గా నిలిచింది. దీంతో కొంత విరామం తీసుకున్న తేజ అంద‌రికీ షాకిస్తూ రెండు ప్రాజెక్ట్‌ల‌ని త‌న పుట్టిన రోజున‌ ప్ర‌క‌టించాడు. విత్ టైటిల్స్‌, హీరోల‌తో స‌హా ప్ర‌క‌టించే స‌రికి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు షాక్ కు గుర‌య్యాయి.

తేజ ప్లానింగ్ ఏంటీ ఇలా వుందని అంతా అవాక్క‌య్యారు. రాక్ష‌స రాజు రావ‌ణాసురుడు, అలిమేలు మంగ వెంక‌ట‌ర‌మ‌ణ‌. మొద‌టి చిత్రాన్ని రానాతో రెండ‌వ చిత్రాన్ని గోపీచంద్‌తో చేయాల‌ని తేజ ఫిక్స్ అయ్యాడు. అయితే `అలిమేలు మంగ వెంక‌ట‌ర‌మ‌ణ‌` చిత్రంలో అలిమేలు మంగ పాత్ర కోసం కాజ‌ల్‌, అనుష్క‌ల‌ని ప‌రిశీలించిన తేజ ఫైన‌ల్‌గా కీర్తిసురేష్‌ని క‌న్ఫ‌మ్ చేసుకున్న‌ట్టు తెలిసింది. న‌ట‌న‌కు ఆస్కార‌మున్న పాత్ర కావ‌డంతో కీర్తి సురేష్ గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు చెబుతున్నారు.

కీర్తి సురేష్ ప్ర‌స్తుతం పెంగ్విన్‌, మిస్ ఇండియా, మోహ‌న్‌లాల్ న‌టిస్తున్న `మ‌ర‌క్కార్ అర‌బిక్క‌డ‌లైంట్ సింహం` చిత్రాల్లో న‌టిస్తోంది.